BigTV English

Jani Master: మాస్టర్ కు షాక్.. జాతీయ అవార్డు రద్దు.. సందిగ్ధంలో బెయిల్..!

Jani Master: మాస్టర్ కు షాక్.. జాతీయ అవార్డు రద్దు.. సందిగ్ధంలో బెయిల్..!

Jani Master.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి కొరియోగ్రాఫర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ లో ధనుష్ (Dhanush) హీరోగా నటించిన తిరుచిత్రంబళం సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఏది ఏమైనా ఒక టాలీవుడ్ కొరియోగ్రాఫర్ పరాయి భాషలో జాతీయ అవార్డు అందుకోవడం అంటే నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 8వ తేదీన జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతూ ఉండగా.. ఆ వేడుకలలో జానీ మాస్టర్ కి అవార్డు ఇవ్వనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి.


జానీ మాస్టర్ కి జాతీయ అవార్డు రద్దు..

అయితే ఇప్పుడు ఈ అవార్డును తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి జానీ మాస్టర్ అభిమానులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 8వ తేదీన జరగబోయే జాతీయ అవార్డుల ప్రధానోత్సవం వేడుకల్లో జానీ మాస్టర్ కి తాత్కాలికంగా అవార్డు ఇవ్వకుండా కమిటీ ఆపివేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ విషయాన్ని నేషనల్ ఫిలిం అవార్డు కమిటీ ప్రకటించింది. నృత్య దర్శకుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ కు ప్రకటించిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు నేషనల్ ఫిలిం అవార్డు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.


పోక్సో చట్టం కింద అరెస్ట్.. అందుకే రద్దు..

అయితే పోక్సో చట్టం కింద ఆయనను అరెస్టు చేసిన నేపథ్యంలోనే.. ఈ జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపి వేసినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే .. తన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు.. ఆ బాధిత యువతి మాట్లాడుతూ.. 2017లో జానీ మాస్టర్ తో పరిచయమైంది. 2019లో ముంబై కి అవుట్ డోర్ షూటింగ్ కి నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో బస చేసాము. ఆ సమయంలో జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని, ఆ తర్వాత పలు బహిరంగ ప్రదేశాలలో చిత్రవధ కు గురి చేయడమే కాకుండా అసభ్యకర మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీంతో నార్సింగి పోలీసులు రంగంలోకి దిగి జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి ప్రస్తుతం చంచల్గూడా జైల్లో రిమాండ్ లో ఉంచారు.

సందిగ్ధంలో బెయిల్..

అయితే ఈయనకు జాతీయ అవార్డు లభించిన నేపథ్యంలో ఈ మేరకే కోర్టు ఐదు రోజులపాటు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఆ అవార్డును కూడా తాత్కాలిక రద్దు ప్రకటించడంతో జానీ మాస్టర్ బెయిల్ సందిగ్ధంలో పడింది. ఇకపోతే నేడు ఈ జాతీయ అవార్డు కోసమే బెయిల్ ఇచ్చిన కోర్టు ఇప్పుడు అది కూడా రద్దు చేయడంతో బెయిల్ క్యాన్సిల్ చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని అభిమానులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×