E-Paper
Advertisement

Jani Master: ఎక్కడ పడితే అక్కడ, ఆఖరికి ఇంట్లో కూడా.. జానీ మాస్టర్‌‌ కేసులో సంచలన నిజాలు

Jani Master: ఎక్కడ పడితే అక్కడ, ఆఖరికి ఇంట్లో కూడా.. జానీ మాస్టర్‌‌ కేసులో సంచలన నిజాలు
Advertisement

Jani Master Case: టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు జానీ మాస్టర్. చాలామంది స్టార్ హీరోలు తమ సినిమాలో ఒక్క పాటకు అయినా జానీ మాస్టర్ కంపోజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయినా కూడా ఈ మాస్టర్ పర్సనల్ లైఫ్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది. ఈసారి ఆయనపై వచ్చిన ఆరోపణలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎక్కడ పడితే అక్కడ

Advertisement

బాధితురాలు అయిన మహిళా కొరియోగ్రాఫర్.. జానీ మాస్టర్‌తో కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అలా వారిద్దరూ కలిసి పలు ఔట్‌డోర్ షూటింగ్స్‌కు కూడా వెళ్తుండేవారు. చెన్నై, ముంబై లాంటి ప్రాంతాలకు షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా నార్సింగిలో తన ఇంట్లో కూడా జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో తెలిపింది. దీంతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జానీ మాస్టర్‌పై పోలీస్ కేసు ఫైల్ అవ్వడంతో ఈ విషయం బయటికొచ్చింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వార్త దుమారం రేపుతోంది. నెటిజన్లు దీని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.

Also Read: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఎవరు ఆమె?

Advertisement

ఆ సెక్షన్ కేసులు

జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 376 – క్రిమినల్ బెదిరింపు, గాయపరచడం, 323లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆన్ స్క్రీన్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే జానీ మాస్టర్.. ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా భిన్నం. ఇంతకు ముందు కూడా ఈ మాస్టర్‌పై పలు కేసులు ఉన్నాయనే విషయం బయటపడింది. 2015లో జానీ మాస్టర్ ఒక కాలేజ్‌లో మహిళపై దాడి చేశారని కేసు ఫైల్ అయ్యింది. అది జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత.. అంటే 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. ఇప్పుడు మరోసారి ఒక యువతి ఫిర్యాదుతోనే ఆయనపై క్రిమినల్ కేసు ఫైల్ అయ్యింది.

కొన్నాళ్ల క్రితం

జానీ మాస్టర్‌పై కేసులు ఫైల్ అవ్వడం మాత్రమే కాదు.. ఆయన పర్సనల్ లైఫ్‌లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. కొన్నిరోజుల క్రితం ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్.. తనకు జానీ మాస్టర్ డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదంటూ కేసు పెట్టాడు. అంతే కాకుండా తనను డ్యాన్స్ అసోసియేషన్ నుండి అనవసరంగా తొలగించారని ఆరోపణలు కూడా చేశాడు. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో జానీ మాస్టర్‌తో పాటు తన సతీమణి, మరికొందరు అసోసియేషన్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తాను ఏదైనా తప్పు చేసినట్టు నిరూపణ అయితే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతానని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. మరి ఈసారి తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×