BigTV English

Jani Master : భర్త అరెస్ట్… పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ భార్య..

Jani Master : భర్త అరెస్ట్…  పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ భార్య..

Jani Master : అత్యాచార కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇరుక్కున్న విషయం తెలిసిందే. పలు షాకింగ్ ఆరోపణల మధ్య ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా జానీ మాస్టర్ భార్య ఆయేషా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది.


పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ భార్య 

జానీ మాస్టర్ భార్య ఆయేషా (సుమలత) పేరును బాధితురాలు ఇప్పటికే తన కంప్లైంట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెను విచారించడానికి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు పోలీసులు. ఓవైపు భర్త అరెస్టు అయితే మరోవైపు పోలీసులు జానీ మాస్టర్ భార్యను ఈ కేసు విషయంలో విచారణ జరిపి, పలు కీలక విషయాలను రాబట్టే ఛాన్స్ ఉంది. మతం మార్చుకొని తన భర్తను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ భార్య తనను బలవంతం చేసిందని సదరు బాధితురాలు తన స్టేట్మెంట్లో వెల్లడించింది. ఇప్పుటి దాకా అందరికీ బాధితురాలు వెర్షన్ మాత్రమే తెలుసు. ఇటీవల జానీ మాస్టర్ భార్య మీడియా ముందుకు వచ్చి ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు అనిపించేలా మాట్లాడింది. జానీ మాస్టర్ కార్డు లేని వాళ్ళకు పని ఇవ్వడం ఏంటి ? అని ప్రశ్నించడంతో కావాలనే ఇలా ఇరికించారని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి విచారణలో దీనికి బాధ్యులైన వారి పేర్లను బయట పెడుతుందా? నెక్స్ట్ ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది? అనే విషయాలు తెలియాలంటే ఆయేషా విచారణ ముగిసే దాకా ఆగాల్సిందే.


Jani Master Wife : పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్ భార్య.. ఆమెపై కూడా కేసు  పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్.. | Jani master wife went to narsing police  station for jani master case-10TV Telugu

ఇప్పుడు జానీ మాస్టర్ వంతు 

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలతో రెండ్రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. జానీపై 21 ఏళ్ల అసిస్టెంట్ డ్యాన్సర్ ఫిర్యాదు చేయగా, పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు గోవాలో జానీ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పరారీలఓ ఉన్నాడు అనే వార్తలు రాగా, గాలింపు బృందాలను ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీసు అధికారులు ఎట్టకేలకు జానీ మాస్టర్‌ను పట్టుకున్నారు. అధికారులు ఇప్పుడు అతన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్‌ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా దీనిపై విచారణ జరిపింది. మైనర్ గా ఉన్నప్పటి నుంచే వేధింపులు మొదలయ్యాయని ఆ మహిళ ఆరోపించడంతో పోలీసు అధికారులు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.

తాను 2017లో జానీ మాస్టర్‌ను కలిశానని, 2019లో అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేయడం ప్రారంభించానని బాధితురాలు పేర్కొంది. ఈ సమయంలోనే లైంగిక వేధింపులు జరిగాయని, అందులో తాము షో కోసం బస చేసిన ముంబై హోటల్‌లో జరిగిన సంఘటనతో సహా పేర్కొంది. వేధింపుల గురించి తాను నోరు తెరవకుండా ఉండడానికి మాస్టర్ తనను బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఫోటోషూట్‌లు, రిహార్సల్స్‌తో సహా పని చేస్తున్న సమయంలో తనను మానసిక వేధింపులకు గురిచేశాడని చెప్పింది. మరి విచారణలఓ జానీ మాస్టర్ ఏం చెప్తాడో చూడాలి.

Related News

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Big Stories

×