Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షోగా ప్రారంభమయ్యింది. కొంతమంది సెలబ్రిటీలను తీసుకొచ్చి కొన్నాళ్ల పాటు అసలు వారికి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా. కానీ వేర్వేరు మనస్థత్వాలు ఉన్న మనుషులు కలవడంతో వారి మధ్య గొడవలు అవుతుంటాయి. బయట ప్రపంచంత కాంటాక్ట్ లేకపోవడంతో మళ్లీ వాళ్లే కలిసిపోతారు. అలా కొందరు చాలా క్లోజ్ అయిపోతుంటారు. ఇంతకు ముందు ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్స్‌లో కూడా అదే జరిగింది. కానీ బిగ్ బాస్ సీజన్ 8లో మాత్రం హగ్గులు, కిస్సులు కాస్త శృతిమించుతున్నాయేమో అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. కొన్నిసార్లు కంటెస్టెంట్స్ ప్రవర్తన చూడడం ఇబ్బందిగా ఉంటుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఏంటా ప్రవర్తన
బాధలో ఉన్నప్పుడు, మనసు బాలేనప్పుడు ఎవరైనా దగ్గర తీసుకుంటే బాగుంటుంది అనిపించడం కామన్. అలాంటివి బిగ్ బాస్ హౌజ్‌లో చాలా జరిగాయి. ముందుగా సోనియానే ఏడుస్తూ అలా ఏడ్చినప్పుడు మరొకరిని హగ్ చేసుకుంటూ ఉండేది. ముఖ్యంగా సోనియా ఏడుస్తుందంటే చాలు.. అభయ్, పృథ్వి, నిఖిల్ వచ్చి ఒకరి తర్వాత మరొకరు తనను హగ్ చేసుకుంటూ షో చూస్తున్న ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. నిఖిల్, పృథ్విలను తన అన్నయ్యలతో పోల్చింది సోనియా. కానీ వారి ప్రవర్తన మాత్రం అలా అనిపించడం లేదని ఆడియన్స్ ఫీలవుతున్నారు. అందరూ పడుకున్న తర్వాత సోనియా.. నిఖిల్, పృథ్విలతో ఒంటరిగా కూర్చొని మాట్లాడడం, వారిపై చేతులు వేయడం.. ఇదంతా చూస్తుంటే అసలు ఇది ఫ్యామిలీ షోనా కాదా అని పలువురు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: విష్ణుప్రియాతో ప్రేరణ ‘దోశ’ గొడవ.. మణికంఠ తలకు గాయం
అమ్మాయిలతోనే అలా
నిఖిల్ కేవలం సోనియాతో మాత్రమే కాకుండా మిగతా అమ్మాయిలతో కూడా అలాగే ఉంటున్నాడు. ఎవరు బాధపడుతున్నారని అనిపించినా ముందుగా వెళ్లి వాళ్లని హగ్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా సోనియాతో నిఖిల్ ప్రవర్తన చాలామంది హౌస్‌మేట్స్‌కు నచ్చడం లేదు. తాజాగా సోనియా సంచాకురాలిగా చేసిన టాస్క్‌లో న్యాయం జరగలేదని అందరూ ఫీల్ అయ్యి తనపై అరవడం మొదలుపెట్టారు. అదే సమయంలో నువ్వెవరు చెప్పడానికి అని పృథ్వి, నిఖిల్‌పై అరిచింది సోనియా. దీంతో ఆ ఇద్దరూ తనపై అలిగారు. వెంటనే నిఖిల్ వెళ్లి సోనియాతో ఈ విషయంపై క్లారిటీ తీసుకొని హగ్ చేసుకున్నాడు. నిఖిల్ మాత్రమే కాదు ఈమధ్య మణికంఠ ప్రవర్తన కూడా అలాగే మారడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
షాకిచ్చిన మణికంఠ
గత కొన్నిరోజులుగా యష్మీతో క్లోజ్‌గా ఉంటున్నాడు మణికంఠ. వారిద్దరి మధ్య హగ్గులు కూడా శృతిమించుతున్నాయి. ఈమధ్య ప్రేరణతో గొడవ జరిగి కాంప్రమైజ్ అయినా తర్వాత కూడా తనను హగ్ చేసుకొని చాలాసేపు వదల్లేదు మణికంఠ. తాజాగా జరిగిన టాస్కులో మణి తలకు గాయం తగిలింది. వెంటనే సోనియాను పక్కకు పిలిచి తనకు హగ్ కావాలని అడిగాడు. మణి అలా డైరెక్ట్‌గా అడగడంతో సోనియా కూడా షాకయ్యింది. తాను టాస్క్ ఆడాలని, ఓపిక కావాలని సంబంధం లేకుండా మాట్లాడింది. అయినా తర్వాత హగ్ చేసుకుంది. హగ్గులు మాత్రమే ముద్దులు కూడా బిగ్ బాస్ హౌస్‌లో కామన్ అయిపోయాయి. దీంతో ఈ షోను ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా అనిపించడం లేదంటూ నెగిటివిటీ పెరిగిపోయింది.