BigTV English

Jani Master : జైలు జీవితంపై కన్నీటిని తెప్పిస్తున్న మాస్టర్ కామెంట్స్.. మనిషి అనేవాడు..!

Jani Master : జైలు జీవితంపై కన్నీటిని తెప్పిస్తున్న మాస్టర్ కామెంట్స్.. మనిషి అనేవాడు..!

Jani Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) ఒకప్పుడు తన అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఎంతోమంది ఆడియన్స్ ను తన అభిమానులుగా మార్చుకున్నారు. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు కూడా ఈయన కొరియోగ్రఫీకి పరవశం అవుతూ ఉంటారు. అంతే కాదు జాతీయస్థాయిలో మెప్పించి జాతీయ అవార్డులు కూడా దక్కించుకున్నారు జానీ మాస్టర్. అయితే తాజాగా లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లిన ఈయన తాజాగా తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో అక్టోబర్ 25వ తేదీన బయటకు వచ్చారు.


మనిషి అన్నవాడు జైలుకు వెళ్ళవద్దు..

మైనర్‌ను అత్యాచారం చేశాడన్న కేసులో జైలు జీవితం అనుభవించిన జానీ మాస్టర్ ఇటీవలే బయటకు వచ్చారు. జ్యూడిషియల్ రిమాండ్ లో భాగంగా 36 రోజుల పాటు జైల్లో ఉన్న ఈయన బయటకు వచ్చిన తర్వాత జైలు జీవితంపై ఊహించని కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ… ఇంకా నాకు జైల్లో ఉన్నట్టే అనిపిస్తోంది. అసలు ఆ ఫుడ్డు తినలేకపోయాను. మనిషి అనే వాడు జీవితంలో జైలుకు వెళ్ళవద్దు. బయట కంటే జైల్లో చాలా నరకం ఉంటుంది. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు. రెండు రోజులు గడిస్తే తప్ప నేను సాధారణ స్థితికి వస్తానని అనిపించట్లేదు. రెండు రోజుల వరకు ఎవరితోనూ మాట్లాడను. దయచేసి అర్థం చేసుకోండి. మీడియా ముందుకి కూడా ఇప్పట్లో రాలేను కొద్ది రోజులు నిజాంపేటలో ఉన్న నా భార్య సుమలత (Sumalatha ) వాళ్ళ ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను. అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను అంటూ తెలిపారు. ఇకపోతే తప్పు చేసి జైలుకెళ్తే ఆ నరకం ఎలా ఉంటుందో.. తన మాటల్లోనే చెప్పిన జానీ మాస్టర్, తప్పు చేయాలనే ఆలోచన కూడా రాకూడదని ఆయన వెల్లడించారు. ఇకపోతే తాను పడ్డ కష్టం గురించి విని ఆయన అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.


అత్యాచార కేసులో జైలుకెళ్లిన జానీ మాస్టర్..

అసలు విషయంలోకెళితే తన దగ్గర పనిచేసే మైనర్ లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ బాధిత యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ముఖ్యంగా ఆయనే తన గ్రూప్ లో చేర్చుకున్నారని, కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత తనపై లైంగిక దాడి చేశాడు అని చెప్పుకొచ్చింది. అంతేకాదు అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్తే అక్కడ హోటల్స్ లో తనపై అత్యాచారం చేసేవాడని , ఎక్కడైనా ఈ విషయం బయటకు చెబితే కెరియర్ లేకుండా చేస్తానని బెదిరించాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక మైనర్ గా ఉన్నప్పుడే ఆమెపై అత్యాచారం చేశాడన్న కారణంతో పోక్సో చట్టం కింద అరెస్టు చేసిన పోలీసులు చంచల్గూడా జైల్లో రిమాండ్ లో ఉంచారు.

జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..

మధ్యలో నేషనల్ అవార్డు అందుకునేందుకు ఐదు రోజులపాటు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టే ఇచ్చి క్యాన్సిల్ చేసింది. దీనికి కారణం లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అవ్వడంతో కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్ కిఇవ్వాల్సిన అవార్డును రద్దు చేసింది. అందుకే న్యాయస్థానం కూడా బెయిల్ రద్దు చేయగా మళ్లీ జైలుకు వెళ్లిపోయారు జానీ మాస్టర్.. ఈసారి హైకోర్టుని ఆశ్రయించగా బెయిల్ ఇవ్వడం జరిగింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×