Jani Master: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్ లో జానీ మాస్టర్ ఒకరు. జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ద్రోణ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా అడుగులు వేశాడు. అయితే డీ అనే షో తో జానీ మాస్టర్ బాగా పాపులర్ అయ్యాడు. ఈ షోలో జానీ మాస్టర్ చాలామంది ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ షో అప్పట్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఈ షోలో కొంతమంది సర్కస్ ఫీట్లు చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ షో నుంచి ఎంతో జెన్యూన్ టాలెంట్ బయటకు వచ్చింది. యంగ్ టాలెంట్ కూడా ఈ షో తో బయటకు వచ్చింది. హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈ షోలో సాయి పల్లవి డాన్సర్ గా కూడా చేసింది. జానీ మాస్టర్ అప్పట్లో జడ్జెస్ తో కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేవాడు. ఆ తర్వాత షో నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ జానీ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన మళ్ళీ డీ లో ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా సరైన గుర్తింపు లభించలేదు. కానీ రామ్ చరణ్ తేజ్ తో ఏర్పడిన పరిచయం జానీను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. రామ్ చరణ్ తేజ్ కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేశాడు జానీ. సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా రచ్చ. ఈ సినిమాలో డిల్లకు డిల్లా అనే పాటకు జానీ కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాట అప్పట్లో మంచి హిట్ అయింది. ఈ పాటలో స్టెప్స్ కూడా చాలా యూనిక్ గా అనిపించాయి. అక్కడితో జానీ మాస్టర్ కి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో జానీ మాస్టర్ అవకాశాలు అందుకున్నాడు. అయితే కెరియర్ పీక్ లో ఉన్న టైం కి జానీ మాస్టర్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తనను లైంగికంగా వేధిస్తున్నాడు అని కంప్లైంట్ చేసింది.
ఆ కేసులో 14 రోజులు రిమాండ్ కు కూడా వెళ్లాడు జానీ. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక జానీ మాస్టర్ ను డాన్సర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు కథనాలు వినిపిస్తూ వచ్చాయి. దీనిపై ఏకంగా జానీ మాస్టర్ రెస్పాండ్ అయ్యారు. నాపై వచ్చిన ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. నేను లీగల్ గా దాని కోసం ఫైట్ చేస్తున్నాను. అలానే నామీద వస్తున్న కథనాలన్నీ అబద్ధం నన్ను ఎవరు తొలగించలేదు. మా ముక్కురాజ్ మాస్టర్ పెట్టిన దానిలో ఇప్పటికి నేను సభ్యుడు గాని కొనసాగుతున్నాను. నా దగ్గర నుంచి చాలామంది కొరియోగ్రాఫర్స్ వచ్చారు. ఇంకా త్వరలో కూడా నా దగ్గర నుంచి చాలామంది కొరియోగ్రాఫర్స్ వస్తారు. ప్రస్తుతానికి నేను నా రిహార్సల్స్ తో బిజీగా ఉన్నాను. ఫేక్ న్యూస్ లు నమ్మొద్దు. నన్ను ఎవరు ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. ఏ యూనియన్ లో అయిన నేను వర్క్ చేయొచ్చు
గేమ్ చెంజర్ లో ఒక పాట చేశాను అది త్వరలో రిలీజ్ కానుంది.
నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!
నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి… pic.twitter.com/qroJxE5Uxv
— Jani Master (@AlwaysJani) December 9, 2024