Vikarabad District Crime: పెళ్ళాం ఊరెళితే సినిమా చూసే ఉంటారుగా. ఆ సినిమాలో పెళ్ళాం ఊరెళితే.. భర్తలు చేసే ఎంజాయ్ మెంట్ అంతా ఇంతా కాదు. అసలు ఎప్పుడెప్పుడా ఊరెళ్లేది అనే తరహాలో ఉంటుంది వారి ఎంజాయ్. కానీ ఇక్కడ ఓ భర్త, పెళ్ళాం ఊరెళితే కొడుకును చావబాదాడు. అంతేకాదు మరో దారుణానికి ఒడిగట్టాడు. అసలేం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మల్కేడ్ హనుమంతుకు భార్య, ఒక కొడుకు ఉన్నారు. అయితే హనుమంతు రోజూ ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణ పడేవాడు. రోజురోజుకు భర్త వేధింపులు తాళలేక భార్య, కుమారుడిని వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా తన భార్య తనను వదిలి వెళ్లడంతో హనుమంతు ఆవేదన చెందాడు. రోజులు గడిచాయి. భార్య మాత్రం రావడం లేదు. ఇలా వేచి చూసిన హనుమంతు భార్య తిరిగి రాకపోవడంతో కొడుకుపై కోపం చూపేవాడట.
ఎలాగైనా తన భార్యను తన ఇంటికి రప్పించాలని అనుకున్న హనుమంతు క్రూరంగా ఆలోచించాడు. ఏకంగా తన కుమారుడిని కత్తితో దాడి చేస్తే, భార్య తప్పక వస్తుందని భావించాడు. అలా అనుకున్నదే తడవు కత్తి చేతబట్టి కొడుకుపైకి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కొడుకు అరవింద్ కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
Also Read: Seethaka Speech: తెలంగాణ తల్లికి నీ చెల్లి రూపం ఇచ్చినప్పుడు ఏమైంది? సీతక్క వైల్డ్ ఫైర్ స్పీచ్
అయితే భార్య పుట్టింటికి వెళ్లి రాకుంటే వెళ్లి పిలిస్తే సరిపోతుంది కానీ, ఏకంగా కొడుకుపై కత్తితో దాడి చేయడం ఏమిటని స్థానికులు చర్చించుకున్నారు. ఏదిఏమైనా అదృష్టవశాత్తు కొడుకు అరవింద్ కు పెను ప్రమాదం తప్పినా, భార్య రాకుంటే కొడుకుపై నీ ప్రతాపం చూపుతావా అంటూ హనుమంతుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కన్న కొడుకుపై తండ్రి హత్యాయత్నం
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఘటన
కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
భార్యను ఇంటికి రప్పించాలనే ఉద్దేశంతో కొడుకు అరవింద్ పై కత్తితో దాడి చేసిన మల్కేడ్ హనుమంతు#Vikarabad #MurderAttempt #BigTV pic.twitter.com/LOSNaZj781
— BIG TV Breaking News (@bigtvtelugu) December 9, 2024