Manchu Mohan Babu : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. వాస్తవానికి మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అని పేరు కూడా ఎందుకు వచ్చిందో ఇప్పటికీ చాలామందికి తెలియని పరిస్థితి. ఈ విషయం పక్కన పెడితే మంచు ఫ్యామిలీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి కుటుంబంలో ఆస్తి తగాదాలు జరగడం అనేది కామన్ గా జరుగుతుంది. కానీ మంచు ఫ్యామిలీలో ఇలా ఆస్తి తగాదాలు జరుగుతున్న తరుణంలో ఎందుకు హైలెట్ అవుతుందంటే, మంచు ఫ్యామిలీ స్టేజ్ ఎక్కిన ప్రతిసారి వాళ్ల గురించి ఇచ్చుకునే బిల్డప్. మోహన్ బాబు మాట్లాడిన ప్రతిసారి తన ఏదో పైనుంచి దిగివచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు వంటి నటుల కంటే కూడా తను గొప్ప నటుడిని అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రజనీకాంత్ ని ఏరా అని స్టేజ్ మీద పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మోహన్ బాబు అహంకారం గురించి ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా వీడియోలు చాలామంది ఇదివరకే చూశారు.
ఇకపోతే మంచు ఫ్యామిలీలో ఇప్పుడు చిచ్చు రాజుకుంది. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన ఫ్యామిలీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది. మోహన్ బాబు ఇంటి వద్ద పొద్దున్నుంచి ఒక హై డ్రామా జరుగుతుంది. ఈ తరుణంలో చాలా మీడియా ఛానల్స్ అక్కడే కూర్చుని అసలు ఏం జరుగుతుంది అని అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా జరుగుతున్న తరుణంలో మరోవైపు శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీలో బౌన్సర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మీడియా సిబ్బందిపై రాడ్లు, కర్రలతో మోహన్ బాబు సెక్యూరిటీ దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బౌన్సర్లు తమపై దాడి చేశారని ఇద్దరు మీడియా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 30మంది బౌన్సర్లు మద్యం మత్తులో రాళ్లు, కర్రలతో దాడి చేశారని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం గాయపడిన జర్నలిస్టులు చంద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇంత జరుగుతున్నా కూడా మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఎవరు క్లారిటీ ఇవ్వటం లేదు. మీడియాను ఆహ్వానించి అన్నిటికీ క్లారిటీ ఇచ్చి, వస్తున్న వార్తలకు చెక్ పెడతారా.? లేక ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మీడియాకి కంటెంట్ ఇస్తూ ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఎప్పుడూ క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ మాట్లాడే మోహన్ బాబు నిజజీవితంలో క్రమశిక్షణ ఏమైందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి అనేది సహజం. కానీ మాట్లాడితే మేము గొప్ప మేం గొప్ప అని చెప్పుకొని మోహన్ బాబు ఏ విషయంలో గొప్ప ఒకసారి చెప్పాలి అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Mohan Babu: డిసిప్లిన్.. మితిమీరిందా? మోహన్ బాబు అలా చేయడం వల్లే అన్నదమ్ముల మధ్య గొడవలు?