Srinu Vaitla : నీకోసం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. రవితేజ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించి లేకపోయినా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత శ్రీను వైట్ల చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాయి. శ్రీను వైట్ల సినిమాలంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ లా అనిపిస్తాయి. శ్రీను వైట్ల హిట్ సినిమా చేసి చాలా ఏళ్లయింది అని చెప్పాలి. ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా తర్వాత ఇప్పటివరకు ప్రాపర్ హిట్ సినిమా శ్రీనువైట్ల చేయలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ కానీ మిగిలాయి. ఇక ప్రస్తుతం గోపీచంద్ హీరోగా విశ్వం అనే సినిమాను చేస్తున్నాడు శ్రీనువైట్ల. ఈ సినిమా అక్టోబర్ 12న రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో ప్రమోషన్స్ లో భాగంగా అనేక రకాల ఇంటర్వ్యూ ఇస్తున్నాడు శ్రీనువైట్ల.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి పై తనకి ఎంత అభిమానం ఉందో చెబుతూ వచ్చారు. అలానే బ్రూస్ లీ సినిమా గురించి కూడా పలు విషయాలను రివిల్ చేశారు. వాస్తవానికి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ని సాధించలేకపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే కూడా అధిక లాభాలను తీసుకొచ్చినట్లు శ్రీను వైట్ల తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కూడా ఈ సినిమా ప్రత్యేకమని చెప్పాలి. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ సినిమాలో ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా ఎంట్రీ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. గుర్రంపై మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి వస్తున్న విజువల్స్ మెగా ఫాన్స్ కి విజువల్ ట్రీట్ లా అనిపించాయి. సినిమా నిరాశపరిచిన కూడా మెగాస్టార్ కనిపించిన ఎపిసోడ్ మాత్రం మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది.
ఇక ప్రస్తుతం గోపీచంద్ కూడా హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ఇక గోపీచంద్ ఆశలన్నీ కూడా విశ్వం సినిమా పైన ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. కేవలం దర్శకుడు హీరోకి మాత్రమే కాకుండా ఈ సినిమా సక్సెస్ అనేది పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ కూడా అవసరం. ఇదివరకే గోపీచంద్ తో ఈ సంస్థ నిర్మించిన రామబాణం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఏదేమైనా ఈ సినిమా మంచి సక్సెస్ అయితే మళ్లీ శ్రీను వైట్ల సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసినట్టే.
ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి దక్కని అవకాశం శ్రీను వైట్లకి దక్కింది. పవర్ స్టార్ , మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా శ్రీనువైట్ల పనిచేసారు. ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమాలు మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయి కానీ ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అందరూ బిలీవ్ చేసి థియేటర్ కు వెళ్లేవాళ్ళు. మళ్లీ శ్రీనువైట్ల ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తే ఎలా ఉండబోతుందని చాలామంది ఎదురుచూస్తున్నారు.