E-Paper
Advertisement

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
Advertisement

OG Movie Update: ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్‌లు వినిపించాయి. ముఖ్యంగా పవన్ రాజకీయ జీవితంలో గ్రాండ్ సక్సెస్‌తో ముందడుగు వేశారు. కానీ సినిమాల విషయంలో పూర్తిగా క్లారిటీ లేదు. దీంతో పవన్ అప్‌కమింగ్ సినిమాల నుండి ఎప్పుడప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ షూటింగ్స్‌లో పాల్గొనడానికి కొన్నాళ్ల క్రితం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. దీంతో అసలు తర్వాత ఏం జరిగింది అనే విషయంపై ఫ్యాన్స్‌లో ఆసక్తి మొదలయ్యింది. తాజాగా ఒక డైరెక్టర్.. ‘ఓజీ’ గురించి అప్డేట్ ఇచ్చి వారిని హ్యాపీ చేశాడు.

మళ్లీ మొదలు

Advertisement

యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు అని తెలియగానే అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అంతే కాకుండా వారిని మరింత హ్యాపీ చేయడం కోసం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చింది మూవీ టీమ్. వెంటనే ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రకటించింది. షూటింగ్ ప్రారంభమయ్యిందని, షెడ్యూల్ పూర్తయ్యిందని.. ఇలా ఎప్పటికప్పుడు దీని గురించి ఏదో ఒక అప్డేట్ బయటికొచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో బిజీ అయిపోగానే అప్డేట్స్ ఆగిపోయాయి. దీంతో సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ మూవీ.. ఒక్కసారిగా వాయిదా పడింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ‘ఓజీ’ షూటింగ్ ప్రారంభమయ్యింది.

Also Read: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు, అమ్మాయిలు ఒప్పుకోరు.. పోసాని కృష్ణ‌ముర‌ళి కామెంట్స్

Advertisement

ఈవెంట్‌లో క్లారిటీ

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ కోసం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి షూటింగ్స్‌కు కాల్ షీట్స్ అందించారు పవన్ కళ్యాణ్. అక్టోబర్‌లో కొన్నాళ్ల పాటు ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొని తనవంతు బాధ్యతను పూర్తిచేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ వార్త బయటికి రాగానే అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం వచ్చింది. అయితే అసలు పవన్ నిజంగానే షూటింగ్స్‌లో అడుగుపెట్టారా లేదా అనే అనుమానం మాత్రం వారిలో ఉండిపోయింది. దానికి ‘మట్కా’ దర్శకుడు కరుణ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ‘మట్కా’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ‘ఓజీ’ షూటింగ్‌ ఇంకా నాలుగు రోజులే ఉందని బయటపెట్టారు.

అయిపోతుంది.. వచ్చేస్తుంది..

‘‘ఓజీ ఇంకా నాలుగు రోజులే షూటింగ్ ఉంది. అది కూడా అయిపోతుంది. వచ్చేస్తుంది. తయారు అవుతుంది’’ అని కరుణ కుమార్ తెలిపారు. దీంతో ‘మట్కా’ టీజర్ లాంచ్‌లో ఇదే హైలెట్‌గా నిలిచింది. సెప్టెంబర్‌లో ‘ఓజీ’ విడుదల కావాల్సి ఉన్నా.. షూటింగ్ పూర్తి కాకపోవడం వల్లే ఇప్పటికీ దీని విడుదలపై క్లారిటీ లేదు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. షూటింగ్ పూర్తవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని, వీలైనంత త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. డిసెంబర్‌లో ‘ఓజీ’ విడుదలయ్యే ఛాన్సులు ఉన్నాయని వార్తలు వినిపించినా వాటిపై ఇంకా క్లారిటీ లేదు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×