BigTV English
Advertisement

Janu Lyri: మళ్లీ పెళ్లి.. మరో వీడియో వదిలిన జాను లిరీ, ఈ సారి..!

Janu Lyri: మళ్లీ పెళ్లి.. మరో వీడియో వదిలిన జాను లిరీ, ఈ సారి..!

Janu Lyri: తెలంగాణ ఫోక్ డాన్సర్ గా పేరు సొంతం చేసుకున్న జాను లిరి (Janu Lyri) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు ఢీ 18 విజేత కూడా.. దీంతో ఈమె కూడా సెలబ్రిటీ అయిపోయింది. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న జాను లిరి సడన్గా నిన్న ట్రోలర్స్ దాడికి తట్టుకోలేకపోతున్నాను.. గలీజ్ పదజాలంతో అసభ్యకరంగా ట్రోల్స్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ వీడియోలు నా కొడుకు చూస్తే పరిస్థితి ఏంటి.. నా కొడుకును ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాను. ఆలోపే నన్ను చంపేసేలా ఉన్నారు.. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది.


మళ్లీ పెళ్లికి సిద్ధం అంటూ వీడియో వదిలిన జాను..

ఇక ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మళ్లీ జాను లిరి కనిపించకుండా పోయింది. దీంతో పలువురు అభిమానులు, సన్నిహితులు జాను లిరికి ఏమైంది..?ఎక్కడికి పోయింది..? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నిన్నటి నుంచి కనిపించకపోవడంతో నెటిజెన్స్ పలు రకాల కామెంట్లు చేస్తుండగా.. సడన్గా మళ్లీ ప్రత్యక్షమైన జాను తాను మళ్లీ పెళ్లికి సిద్ధం అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. త్వరలోనే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాను.. నా కొడుకుతో సంతోషంగా జీవించబోతున్నాను అంటూ జాను లిరి చెప్పుకొచ్చింది. అంతేకాదు దానివల్ల మీ అందరికీ ఏదైనా ఇబ్బంది ఉందా అంటూ కూడా ప్రశ్నించింది. దాంట్లో జాను మాట్లాడుతూ.. నేను నిన్న ట్రోల్స్ కి తట్టుకోలేక చిన్నగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఆలోచించాను. నేనేం చేసినా ట్రోల్స్ అనేవి ఆగవని.. అయితే నేనిక చచ్చిపోతానని వీడియో వదిలిన కొద్ది క్షణాల్లోనే నన్ను ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఏమైంది అంటూ కంగారు పడిపోయారు. నాకు అండగా నిలిచారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక ట్రోల్స్ చేసేవారికి నేను ఒకటే చెప్పబోతున్నాను. నేను, నా కొడుకు ఇంకా సంతోషంగా ఉంటాము. ఏం చేస్తారో చేసుకోండి” అంటూ వీడియో రిలీజ్ చేసింది జాను.


కాబోయే వ్యక్తి ఫోటోని షేర్ చేసి, డిలీట్ చేసిన జాను లిరి

మొత్తానికి అయితే జాను లిరి చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. జాను ఎవరినైతే వివాహం చేసుకోబోతోంది అతడికి సంబంధించిన ఫోటో ని కూడా తన ఇన్స్టాలో షేర్ చేసింది. కానీ ఇంతలోనే ట్రోల్స్ పెరిగిపోయేసరికి ఆ ఫోటోని , వీడియోలను కూడా డిలీట్ చేసింది. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు పెళ్లికి సిద్ధమైనప్పుడు ఇద్దరి నుంచి కూడా ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తుంది. కానీ ఈ విషయాన్ని జాను మాత్రమే వెల్లడించింది అటు ఆ వ్యక్తి ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. మొత్తానికి అయితే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది జాను లిరి.

ALSO READ:Shahrukh Khan: సినిమా బతకాలంటే అలా చేయాల్సిందే.. షారుక్ మాటలు పరిగణలోకి తీసుకుంటారా..?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×