BigTV English

Single: సెన్సార్ పూర్తి.. రన్ టైం లాక్.. ఈ సీన్స్ కోసమైనా సినిమా చూడాల్సిందే భయ్యా..

Single: సెన్సార్ పూర్తి.. రన్ టైం లాక్.. ఈ సీన్స్ కోసమైనా సినిమా చూడాల్సిందే భయ్యా..

Single: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సింగిల్. ఈ మూవీలో కేతిక శర్మ,ఇవానా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో విద్య కుప్పినీడి భాను ప్రతాప్, ప్రియాతి చౌదరి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం..


సెన్సార్ పూర్తి..ఈ సీన్స్ కోసమైనా సినిమా చూడాల్సిందే..

సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలలో మొదటివాడు శ్రీ విష్ణు. ఈ హీరో సినిమాలు ఎక్కువగా కామెడీ జోనర్ లోనే వస్తాయి. తాజాగా సింగిల్ అంటూ ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే చిత్రంతో మన ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తయినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. రెండు గంటల 35 నిమిషాల రన్ టైం తో మన ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్లో కొన్ని డైలాగులపై వచ్చిన వివాదం అందరికీ తెలిసిందే, ట్రైలర్ లో కన్నప్ప మూవీ టీంని బాధపెట్టే విధంగా డైలాగ్స్ ఉన్నాయని వారు ఆరోపించడంతో.. వాటిని ఈ సినిమా నుండి తీసేస్తున్నట్లు శ్రీ విష్ణు తాజాగా ప్రకటించారు. ట్రైలర్ లోని వెన్నెల కిషోర్ ,శ్రీ విష్ణు మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ సీన్స్ కోసం అయినా సినిమా చూడాల్సిందే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.ఇప్పుడు సెన్సార్ U/A సర్టిఫికెట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.


బంపర్ ఆఫర్..

తాజాగా శ్రీ విష్ణు ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో తన పేరుకు ముందు సింగిల్ అని చేరుస్తున్నట్లు ప్రకటించారు. తన ఫ్యాన్స్ కి ఓ బంపర్ ఆఫర్ ని కూడా ప్రకటించారు. ఎవరైతే మీ పేరు ముందు మీరు సింగిల్ గా ఉన్నారు అని తెలియడానికి గుర్తుగా నాలాగా సింగిల్ అని కొన్ని కామెంట్స్ చేసిన వారికి హీరోయిన్స్ ని పరిచయం చేస్తాను అంటూ బంపర్ ఆఫర్ ని ప్రకటించారు. ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ విష్ణు తన పేరుకు ముందు సింగిల్ అని చేర్చుకున్నారు. ఈ సినిమా తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ ట్రైలర్ లోని వెన్నెల కిషోర్ ,శ్రీ విష్ణు మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ సీన్స్ కోసం అయినా సినిమా చూడాల్సిందే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సునీల్, కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందించనున్నారు. లవ్ టుడే సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఇవానా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. గత సంవత్సరం స్వాగ్ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. ఇప్పుడు శ్రీ విష్ణు ఆశలన్నీ, రానున్న సింగల్ పైనే ఉన్నాయి. ఈ చిత్రం మే 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kingdom Movie First Single : కింగ్‌డం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది… ‘హృదయం లోపల’ నుంచి వచ్చిన పాట ఇది

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×