Shahrukh Khan:ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చినా సరే తన సినిమాలతో వేలకోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తూ.. తన స్టామినా ఏంటో నిరూపిస్తున్నారు. మొన్నటి వరకు ఏ విషయాలపై పెద్దగా స్పందించని షారుఖ్ ఖాన్.. ఇప్పుడు సినిమా బ్రతకాలంటే అలా చేయాలి అంటూ ఊహించని కామెంట్లు చేశారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాలంటే..?
ఆషాడం, దసరా, దీపావళి ఆఫర్లలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్న నినాదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి కూడా పాకింది. ఎలాగైతే వస్త్ర దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ఈ ఆఫర్లు చూస్తున్నామో.. ఇప్పుడు అదే ఆఫర్లు సినిమా ఇండస్ట్రీకి కూడా వర్తించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇలాంటి బోర్డులు ఎక్కడ కనిపించవు. ఇప్పుడు అనూహ్యంగా థియేటర్లలో కూడా ఇలాంటి బోర్డులు కనిపించేసరికి సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అంటూ టికెట్ 99 రూపాయలకే అంటూ విడుదలకు ముందే మేకర్స్ అనౌన్స్ చేస్తూ ఇప్పుడు జనాలను థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి కరోనా వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రజలు థియేటర్లకు రావాలి అంటేనే భయపడుతున్నారు. దీనికి కారణం పెరిగిన టికెట్ ధర.. పైగా కంటెంట్ లేకపోవడం.. దీనికి తోడు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడాలి అంటే భయపడిపోతున్నారు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా సినిమాలకు ఫ్యామిలీతో వెళ్లాలి అంటే అత్యంత శ్రమతో కూడుకున్న పని. దీనికి తోడు ఈ మధ్యకాలంలో థియేటర్ల వద్ద జరుగుతున్న తొక్కిసలాటలో ఏకంగా ప్రాణాలు కూడా పోతున్న నేపథ్యంలో ఎందుకు వచ్చిన గొడవ అని చాలా మంది థియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు.
అద్భుతమైన ఐడియా ఇచ్చిన షారుఖ్ ఖాన్..
అందుకే ఇప్పుడు ఆ ఆడియన్స్ థియేటర్లకు రప్పించడానికి మేకర్స్ నానాతంటాలు పడుతున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే విషయంపై హీరో షారుఖ్ ఖాన్ స్పందించారు.. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ -2025 లో తనదైన స్టైల్ లో ఆకట్టుకున్న ఈయన అంతకుమించి అనేలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మూవీ లవర్స్ ను సినిమా థియేటర్లకు రప్పించేలా ఒక సూపర్ ఐడియా షేర్ చేస్తున్నారు. మొన్నటి వరకు జనం కంటెంట్ ఉన్న సినిమాలకే పెద్దపీట వేశారు. టికెట్లు రేట్లు పెరిగినా చుసేందుకు ఆసక్తి చూపారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అదే సమస్యగా మారిపోయింది. ఫ్యామిలీతో కలిసి మల్టీప్లెక్స్ లకు వస్తే టికెట్ ధరలు, స్నాక్ రేట్లకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. అంటూ కొంతమంది వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. పైగా ఓటీటీ , పైరసీల వల్ల జనం కూడా థియేటర్లకు రావడం మానేశారు. దీంతో మేకర్స్ మూవీ లవర్లను థియేటర్లకు రప్పించడానికి స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. అందుకే ప్రతి ఊరిలో థియేటర్ లు ఉండాలి. వాటిలో భాషతో సంబంధం లేకుండా భారతీయ చిత్రాలు ప్రదర్శించాలి. టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి. ఇలా చేసుకుంటే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి అంటూ వివరించారు. మరి షారుఖ్ ఖాన్ చేసిన మాటలను ఇండస్ట్రీ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.
ALSO READ:Vijay Deverakonda: ఆదివాసీ వివాదం… ఇన్నాళ్లకు కేసుపై స్పందించిన రౌడీ హీరో .. !