BigTV English

Jayam Ravi: నాకు చెప్పకుండానే విడాకులు.. స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్

Jayam Ravi: నాకు చెప్పకుండానే విడాకులు.. స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్

Jayam Ravi’s wife Aarti Shocking Comments: తమిళ ప్రముఖ హీరో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంపై ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు విడాకులు తీసుకుంటున్నట్లు తెలియదని, తనకు చెప్పకుండానే విడిపోతున్నామని జయం రవి విడాకుల ప్రకటన చేశారని ఆర్తి ఆరోపించింది. ఈ మేరకు రవి పేరుతో ఆర్తి ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది.


ఇందులో తన ప్రమేయం లేదని, తన అంగీకారం లేకుండా తనకు తెలియకుండానే విడాకులు తీసుకున్నట్లు ప్రకటన చేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రవి చేసిన ప్రకటనతో ఆశ్చర్యపోయానని, సమస్యలు పరిష్కరించుకోవాలని పలుమార్లు ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ప్రత్యేకంగా తన భర్తతో మాట్లాడుదామని అనుకున్నానని, అయితే ఎలాంటి అవకాశం లేకపోయిందని వాపోయారు.

తన వ్యక్తిత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ క్లిష్ణ సమయంలో పిల్లల సంరక్షణపై దృష్టి పెడతానని చెప్పారు. జయం రవి, ఆర్తిలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. కాగా, రెండు రోజుల క్రితం జయం రవి తన భార్య నుంచి విడాకులు తీసుకున్నామని, తాము విడిపోతున్నామని సోషల్ మీడియాలో ప్రకటించాడు.


నాకు తెలియకుండా, అనుమతి లేకుండా మేము విడిపోతున్నామని జయం రవి ప్రకటన చేయడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. 18 ఏళ్లు ఇద్దరం కలిసి జీవించిన ఆయన.. జీవితంలో అటువంటి ముఖ్యమైన విషయాన్ని నాకు చెప్పకుండా విడిపోతున్నట్లు ప్రకటన చేయడం ఏంటి? అని ప్రశ్నించింది.

మా వివాహం రద్దు చేసుకొని విడిపోవాలనే నిర్ణయం ఆయనే తీసుకోవడం ఏంటని, ఈ విషయం మా కుటుంబానికి ప్రయోజనంగా లేదన్నారు. ఈ సంఘటన నాతోపాటు పిల్లలకు బాధ కలిగించినప్పటికీ నేను గౌరవ ప్రదంగా ఉండాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.

అయితే, తనపై కొంతమంది నిందలు వేస్తున్నారని, తన క్యారక్టర్ ను సైతం తప్పుగా చూపిస్తున్న వార్త కథనాలు రావడంతో ఆవేదనకు గురైనట్లు చెప్పారు. ఒక తల్లిగా మొదటి ప్రాధాన్యత పిల్లలే అని చెప్పింది. త్వరలోనే నిజాలు ఏంటో తెలుస్తాయని చెప్పారు.

Also Read:  ‘విశ్వం’ నుంచి సాంగ్ రిలీజ్.. బీట్ భలే కొత్తగా ఉందే

ఇదిలా ఉండగా, వ్యక్తిగత కారణాలతో పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నామని జయం రవి చెప్పారు. అంతకుముందు, విడాకుల విషయంపై రూమర్స్, ఆరోపణలు చేయరాదని కోరారు. ఈ విషయం వ్యక్తిగతమని, దయచేసి పుకార్లు రాయకండి అన్నారు. అలాగే సినిమాల్లో నటిస్తూనే ఉంటానని, ప్రేక్షకులకు వినోదం పంచేందుకు కష్టపడుతానన్నారు. ఎప్పటికీ మీ జయం రవిగా ఉంటానని, ఇలాగే నాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.

దాదాపు 15ఏళ్లపాటు అన్యోన్య దంపతులుగా ఉన్న జయం రవి, ఆర్తి విడిపోతున్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. మొదట ఆర్తి తన ఇన్‌స్టాలో భర్త జయం రవి ఫొటోలను తొలగించింది. ఈ తరుణంలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు అనే ప్రచారం జోరుగా సాగింది. కాగా, తాజాగా, ఆర్తి చేసిన వ్యాఖ్యలపై జయం రవి ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×