BigTV English

Sprouted Ragi Benefits: మొలకెత్తిన రాగులతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు..

Sprouted Ragi Benefits: మొలకెత్తిన రాగులతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు..

Sprouted Ragi Benefits: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బోలేడు మార్గాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా రాగులు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి. రాగులే కాకుండా, రాగి పిండితో కూడా ప్రయోజనాలు ఉంటాయి. తరచూ రాగి పిండితో చపాతీలను తయారుచేసుకుని తినడం వల్ల బోలెడు లాభాలు ఉంటాయి. అంతేకాదు రాగులతో పాటు మొలకెత్తిన రాగులను తినడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి.


మొలకెత్తిన రాగులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో కాల్షియం, విటమిన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీంతో మొలకెత్తిన రాగులను తినడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల తరచూ మొలకెత్తిన రాగులను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

రక్తంలోని చక్కెర స్థాయి కంట్రోల్ చేస్తుంది


మొతకెత్తిన రాగులను తీసుకోవడం వల్ల రక్త హీనత వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాదు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి కూడా మొలకెత్తిన రాగులు అద్భుతంగా తోడ్పడతాయి. మరోవైపు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇక రోగనిరోధక శక్తి వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. మొలకెత్తిన రాగులను తీసుకుంటే మెదడు పనితీరు కూడా సక్రమంగా ఉంటుంది.

మలబద్ధకం నివారణ

మలబద్ధకం, జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా మొలకెత్తిన రాగులను తీసుకోవడం వల్ల నివారించవచ్చు. మొలకెత్తిన రాగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇక ఇందులో ఉండే మినరల్స్, ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచేందుకు సహాయపడుతుంది.

కండరాల పెరుగుదల

రాగుల్లో ఉండే ప్రోటీన్ పరిమాణం వల్ల కండరాల పెరుగుదలకు అద్భుతంగా తోడ్పడుతుంది. ఇక మొలకెత్తిన రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

చర్మ సంరక్షణ

కేవలం జీర్ణవ్యవస్థ సమస్యకు మాత్రమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా మొలకెత్తిన రాగులు అద్భుతంగా తోడ్పడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. ఇక చర్మంపై ముడతలు కూడా రాకుండా చేస్తాయి. మరోవైపు రాగుల్లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఏర్పడే ప్రోటీన్, విటమిన్ లోపాల నుంచి తప్పించుకోవచ్చు. మరోవైపు ఇందులో విటమిన్ ఈ, జింక్, ఐరన్, బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఉండడం వల్ల శరీరంలో వీటి పరిమాణాన్ని పెంపొందించుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×