BigTV English

Jayam Ravi Divorce: చిత్రసీమలో మరో జంట విడాకులు.. కన్ఫర్మ్ చేసిన స్టార్ హీరో

Jayam Ravi Divorce: చిత్రసీమలో మరో జంట విడాకులు.. కన్ఫర్మ్ చేసిన స్టార్ హీరో

Jayam Ravi Divorce: సినీ ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారం సాధారణమైపోయింది. ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవటం, కొన్నేళ్లు కలిసి జీవించాక విడిపోవటం. ఇదంతా ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీలోని ట్రెండ్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ ఇలా చాలా భాషల్లోని సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని విడిపోతున్నారు. అందుకు కారణాలు ఏవైనా, ఎన్నైనా విడిపోవడమే కరెక్ట్ అని భావించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు డివోర్స్ తీసుకుని తమ అభిమానులకు షాక్ ఇచ్చారు.


తాజాగా చిత్రసీమలో మరో జంట విడాకులు తీసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగులోనూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ హీరో ఇప్పుడు తన భార్య ఆర్తితో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చాడు. తాజాగా జయం రవి, ఆర్తి తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు.

అయితే వీరి విడాకుల వ్యవహారం గురించిన వార్తలు గత మూడు నెలల క్రితం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా ఈ జంట తమ బంధానికి ముగింపు పలికింది. ఈ మేరకు నటుడు జయం రవి సోషల్ మీడియా ద్వారా ఒక నోట్‌ను షేర్ చేశాడు.


Also Read: అద్భుతం, యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న బిగ్ టీవీ ‘కిర్రాక్ కపుల్స్’ షో.. ఒక్క రోజులో ఎన్ని వ్యూసో తెలుసా?

‘‘జీవితం అనేది విభిన్న అధ్యాయాలతో కూడిన ప్రయాణం. ప్రతి అధ్యాయంలో స్వంత సవాళ్లు, అవకాశాలు ఉంటాయి. సినిమాల ద్వారా నా ప్రయాణాన్ని ఫాలో అవుతున్న సినిమా పరిశ్రమ, ప్రెస్, మీడియా ఇండస్ట్రీ, సోషల్ మీడియా, నా అభిమానులతో నేను నిజాయితీగా, ఓపెన్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. అందువల్ల నేను మీతో చాలా వ్యక్తిగత మెసేజ్ పంచుకోవాలని చూస్తున్నాను. చాలా ఆలోచించి.. చాలా చర్చించిన తర్వాత ఆర్తితో నా వివాహానికి దూరంగా ఉండాలనే చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదు. నాపై ఆధారపడిన వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నాను.

ఈ సమయంలో నా ప్రైవసీని గౌరవించాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ నిర్ణయం నా స్వంత నిర్ణయం. ఈ విషయం నా వ్యక్తిగత విషయంగానే ఉండాలని ప్రార్థిస్తున్నాను. నా అభినయం ద్వారా నా అభిమానులను, ప్రజలను ఆనందపరిచి, అలరించడమే నా ప్రాధాన్యత. నేను ఎప్పుడూ మీ జయం రవిగానే ఉంటాను. మీరు నాకు ఇస్తున్న మద్దతుకు నేను కృతజ్ఞతగా భావిస్తున్నాను’’ అంటూ ఓ నోట్ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×