BigTV English

Jayam Ravi : సాక్ష్యాలు బయట పెడతా… జయం రవి భార్యకు సింగర్ స్ట్రాంగ్ వార్నింగ్

Jayam Ravi : సాక్ష్యాలు బయట పెడతా… జయం రవి భార్యకు సింగర్ స్ట్రాంగ్ వార్నింగ్

Jayam Ravi : ప్రముఖ తమిళ స్టార్ జయం రవి ఇటీవల కాలంలో విడాకులు, ఎఫైర్ల రూమర్లతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఓ సింగర్ తో ఎఫైర్ పెట్టుకున్న జయం రవి భార్యను వదిలేస్తున్నాడు అంటూ రూమర్లు రాగా, రీసెంట్ గా ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సదరు సింగర్ ఏకంగా సాక్ష్యాలు బయట పెడతాను అంటూ జయం రవి భార్యకు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తోంది. అసలు ఆ సింగర్ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం పదండి.


జయం రవిని ఇంత టార్చర్ చేశారా? 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్, థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ట్రీట్మెంట్ కోసమే జయం రవి తన వద్దకు వచ్చాడని వెల్లడించారు. ఆర్తి రవితో తన వివాహంలో ఎదురైన కఠినమైన ఛాలెంజ్ లతో అతను మానసికంగా క్రుంగిపోయాడని ఆమె పేర్కొంది. కెనిషా మాట్లాడుతూ “ఆర్తితో ఆయన వివాహ బంధంలో నడుస్తున్న విబేధాల కారణంగా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు.  ట్రీట్మెంట్ కోసం జూన్ నెలలో నా దగ్గరకు వచ్చాడు. అతని సమస్యను తెలుసుకున్నాక ఒక థెరపిస్ట్‌గా ఒక మనిషి తల్లిదండ్రులను కోల్పోయిన బాధ కంటే జయం రవి పడిన బాధ పెద్దదని నాకు అన్పించింది. ఆర్తి, ఆమె తల్లిదండ్రుల వల్ల అతను పడ్డ కష్టాల గురించి వినడం చాలా బాధాకరంగా అన్పించింది. అమ్మాయి అయినా, అబ్బాయైనా ఇంకొకరిని ఇంత బాధ పెట్టే రైట్ ఎవ్వరికీ లేదు, మా థెరపీకి సంబంధించిన నా నోట్స్ తో పాటు నేను అన్ని సాక్ష్యాలను కోర్టులో రవి అనుమతితో లేదా లేకుండా కూడా విడుదల చేయగలను” అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. ఇప్పుడు కెనిషా థెరపీ సెషన్స్‌లో జరిగిన విషయాలను బయట పెడుతూ కోర్టులో ఆర్తికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలను నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఆర్తి, జయం రవిని అంత టార్చర్ చేసిందా అని షాక్ అవుతున్నారు నెటిజన్లు.


జయం రవితో సింగర్ రిలేషన్ ఇదేనట 

ఈ సందర్భంగా కెనిషా ఫ్రాన్సిస్ జయం రవితో తనకు ఉన్న రిలేషన్ ఏంటో వివరించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ ‘‘జయం రవితో నా స్నేహం కేవలం వృత్తిపరమైనది. జయం రవి నా స్నేహితుడు, నా క్లయింట్.. విడాకులకు నేనే కారణమని చెబుతున్నారు. అది పూర్తిగా అబద్ధం.. రవి తన భార్యకు విడాకుల నోటీసు పంపే వరకు ఆ విషయం గురించి నాకు పెద్దగా తెలియదు. ఇది మీ కుటుంబ సమస్య కాదు, మరొకరి కుటుంబ సమస్య. దానికి దూరంగా ఉండండి. నన్ను ఈ విషయంలోకి లాగొద్దు” అని చెప్పింది. జయం రవి కూడా దాదాపుగా ఇదే చెప్పాడు. ఆమె ఒక సైకాలజిస్ట్, ఆమెను మధ్యలోకి లాగొద్దు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలా ఉండగా తన చిరకాల స్నేహితురాలు ఆర్తిని జయం రవి 2009 జూన్ 4న ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు అయాన్, ఆరవ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో జయం రవి తన భార్య ఆర్తికి 9వ తేదీన విడాకులు ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ విషయంపై తనకు ఎలాంటి అవగాహన లేదని ఆయన భార్య ఆర్తి ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. కాగా జయం రవి తన భార్య ఆర్తిపై విడాకుల కేసు వేయడంతో పాటు అడయార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చెన్నైలోని ఈసీఆర్‌ రోడ్డులో ఉన్న ఆర్తి ఇంట్లో తన వస్తువులను స్వాధీనం చేసుకోవాలని జయం రవి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు . ఈ ఫిర్యాదుపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతుండటం గమనార్హం.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×