BigTV English

Bigg Boss 8 Day 25 Promo 1: టాస్క్ పేరుతో లవ్ ట్రాక్ మొదలు.. అమ్మాయి మోములో సిగ్గుమొగ్గలు..!

Bigg Boss 8 Day 25 Promo 1: టాస్క్ పేరుతో లవ్ ట్రాక్ మొదలు.. అమ్మాయి మోములో సిగ్గుమొగ్గలు..!

Bigg Boss 8 Day 25 Promo 1.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న గేమ్ షో బిగ్ బాస్ (Bigg Boss).. ఇప్పుడు ఎనిమిదవ సీజన్లో భాగంగా నాలుగవ వారం చివరి దశకు చేరుకుంది. ఇక మరో రెండు రోజులు ఆగితే ఇంకొకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇప్పటికే మూడు వారాలలో భాగంగా బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా , అభయ్ నవీన్ ఎలిమినేట్ కాగా నాలుగవ వారం సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతోంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె ఎలిమినేట్ కాకుండా ఈమెను గెలిపించాలని, ఓటు వేయాలి అంటూ ప్రముఖ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈమెతో ఉన్న ఫోటోని షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు


ఇదిలా ఉండగా 14 మంది హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టారు.. కానీ ఇప్పుడు వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అవుతున్న నేపథ్యంలో ఏకంగా 12 మందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్. ఈ 12 మందిని హౌస్ లోకి అడుగుపెట్టకుండా ఆపే శక్తి కూడా మీకే ఉందంటూ కంటెస్టెంట్స్ కే వదిలేశారు. అలా 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ ను ఆపే విధంగా 12 ఛాలెంజ్ లను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. ఈ 12 ఛాలెంజ్ లను నెగ్గడానికి అటు కాంతారా క్లాన్, ఇటు శక్తి క్లాన్ శక్తికి మించి పోరాడుతున్నారని చెప్పవచ్చు. ఛాలెంజ్ లో భాగంగా కొత్త టాస్క్ ను నిర్వహించారు బిగ్ బాస్.అదే బలూన్ టాస్క్.

టాస్క్ పేరుతో లవ్ ట్రాక్..


ఇకపోతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మూడవ ఛాలెంజ్ పట్టుకొనే ఉండు.. లేదా పగిలిపోతుంది. ఈ ఛాలెంజ్ ను గెలవడానికి మీరు చేయవలసిందల్లా.. ఫ్రేమ్ మీద హ్యాండిల్ కి కట్టి ఉన్న మేకు.. బెలూన్ కి తగలకుండా ఉండేలా చూసుకోవడం అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్.ఈ టాస్క్ ఆడడానికి ఒకవైపు కాంతారా క్లాన్ నుంచి నబీల్ , శక్తి క్లాన్ నుంచి పృథ్వి ముందుకొచ్చారు. ఇద్దరి మధ్య సంచాలక్ గా మణికంఠ వ్యవహరించారు.

పృథ్వీ – విష్ణుప్రియ మధ్య లవ్ ట్రాక్ మొదలు..

ఇక అదే సమయంలో “నీ చూపులే నా ఊపిరి.. ఓసారిలా.. ” అంటూ పృథ్వీ పాట పాడడం మొదలుపెట్టాడు. దీంతో హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిందని చెప్పాలి. ఇద్దరు కూడా ఛాలెంజ్ గెలవడానికి చాలా సేపే హ్యాండిల్ పట్టుకున్నారు. ఇక తర్వాత బిగ్ బాస్ పృథ్వీ మన కోసం ఒక పాట పాడుతారు అని చెప్పడంతో.. పృథ్వీ “ఎవరెవరో.. నాకు ఎదురైనా..” అనే పాట పాడడం మొదలు పెడతాడు. ఆ తర్వాత నబీల్.. హౌస్ లో ఎవరికోసమో అడగండి బిగ్ బాస్ అనగానే పృథ్వీ విష్ణు కోసం అంటూ చెప్పేశాడు. దీంతో విష్ణు మోములో సిగ్గు మొగ్గలేస్తోంది. దీంతో ఆనందం పట్టలేక ఎగిరి గంతేసింది విష్ణు ప్రియ. వెంటనే ఉండిపోరాదే అనే పాట ప్లే చేశారు బిగ్ బాస్. ప్రస్తుతం ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. మొత్తానికైతే టాస్క్ పేరు తో లవ్ ట్రాక్ మొదలు పెట్టేసాడు బిగ్ బాస్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×