BigTV English
Advertisement

KBC 16 : కెబిసిలో 7 కోట్ల జాక్ పాట్ ప్రశ్న వరకు చేరుకున్న కంటెస్టెంట్.. ప్రశ్నకు సమాధానం మీరు చెప్పగలరా?..

KBC 16 : కెబిసిలో 7 కోట్ల జాక్ పాట్ ప్రశ్న వరకు చేరుకున్న కంటెస్టెంట్.. ప్రశ్నకు సమాధానం మీరు చెప్పగలరా?..

KBC 16 | సామాన్యుల తలరాతలు మార్చే రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి (కెబిసి). ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వచ్చే ఈ పాపులర్ క్విజ్ గేమ్ షో.. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రజలను ఆకట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం కెబిసి సీజన్ 16 ప్రసారమవుతోంది. చూడడానికి చాలా ఈజీగా ఉండే గేమ్ షోలో అందరూ కోటీశ్వరులు అయిపోదామని వెళ్తారు. కానీ కొందరు మాత్రమే రూ.కోటి ప్రశ్న వరకు ఆటను ఆడగలరు. అలాంటిది రూ.7 కోట్ల ప్రశ్న వరకు వెళ్లడమంటే సామాన్య విషయం కాదు. అలాంటి అరుదైన ఫీట్ సాధించిన బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ఒక సామాన్యుడు సాధించాడు.


వివరాల్లోకి వెళితే.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన చందర్ ప్రకాశ్ రూ. కోటి గెలుచుకున్నాడు. యుపిఎస్‌సి సివిల్స్ పరీక్షలకు శిక్షణ పొందుతున్న చందర్ ప్రకాశ్ బుధవారం కెబిసి హాట్ సీట్ లో కూర్చొని ఏకంగా రూ.7 కోట్ల ప్రశ్నను ఎదుర్కొన్నాడు. ఆటలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధనం చెబుతూ వెళ్లిన చందర్.. అమితాబ్ బచ్చన్ అడిగిన రూ.7 కోట్ల ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. అంత పెద్ద జాక్ పాట్ ప్రశ్న కూడా చాలా కఠినంగా ఉంది. దీంతో అతను గేమ్ క్విట్ చేశాడు. అతని ఆటతీరుని మహానటుడు అమితాబ్ బచ్చన్ కౌగిలించుకొని ప్రశంసించారు.

Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట,  రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ


రూ.ఏడు కోట్ల జాక్ పాట్ ప్రశ్న ఇదే:
ఏడు కోట్ల రూపాయల ప్రశ్న అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ ప్రశ్న చూసి ఇది అంత ఈజీ కాదని అర్థమవుతుంది. చందర్ ప్రకాశ్ కూడా ప్రశ్న చూసి నర్వస్ అయ్యాడు. అయినా అమితాబ్ బచ్చన్ అతడికి ధైర్యం చెప్పి ప్రయత్నించాలని చెప్పారు.

ప్రశ్న: 1587 సంవత్సరంలో రికార్డుల ప్రకారం.. ఇంగ్లీష్ దంపతులకు జన్మించిన తొలి సంతానం ఎవరు?

ప్రశ్న విన్నారుగా.. సమాధానం చెప్పడం అంత సులభం కాదని ఈపాటికే అర్థమై ఉంటుంది. దీనికి సమాధానంగా నాలుగు ఆప్షన్లు ఉన్నాయి.

A- వర్జీనియా డేర్

B- వర్జీనియా హాల్

సి- వర్జీనియా కాఫీ

D- వర్జీనియా సింక్

ఈ అప్షన్స్ చూసి.. తనకు దీని గురించి అవగాహన లేదని చందర్ ప్రకాశ్ చెప్పాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ A- వర్జీనియా డేర్.

రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?..
ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినా.. రూ. కోటి ప్రశ్నకు సమాధానం చెప్పాడు చందర్ ప్రకాశ్.

ప్రశ్న: ఏ దేశంలో అతిపెద్ద నగరం దానికి రాజధాని కాదు.. ఆ నగరంలో అతిపెద్ద పోర్టు ఉంది. ఆ దేశం పేరు అరబిక్ పదంతో వచ్చింది. ఆ అరబిక్ పదానికి అర్థం ప్రశాంత స్వర్గం.

A: సోమాలియా
B: ఒమన్
C: టాంజానియా
D: బ్రూనై

కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. టాంజానియా. ఆఫ్రికా దేశమైన టాంజానియా పేరు అరబిక్ పదం నుంచి వచ్చింది.

Also Read: కోటి రూపాయల ప్రశ్న.. కెబిసి కంటెస్టెంట్ ఫెయిల్.. మీరు చెప్పగలరా?..

అయితే ఈ గేమ్ ఆడిన కంటెస్టెంట్ చందర్ ప్రకాశ్ తనతో పాటు రూ.కోటి తీసుకెళ్లాడు. అతను కటిక పేదరికంలో జీవిస్తున్నాడు. అతను పుట్టిన సమయంలో అతని పేగుల్లో సమస్య ఉండడంతో ఆపరేషన్ చేశారు. దీని వల్ల అతనికి ఆపరేషన్ చేశారు. కానీ ఆ చికిత్స వల్ల అతని కిడ్నీలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం చందర్ ప్రకాశ్ ఎకనామిక్స్ మాస్టర్స్ చదువుతూ.. యుసిఎస్‌సి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×