Producer Sujatha : తమిళ స్టార్ హీరో జయం రవి, ఆర్తిల విడాకుల మ్యాటర్ రోజురోజుకీ ముదిరిపోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ అటు కోలీవుడ్ వర్గాలను ఇదే చర్చ నడుస్తుంది. ఆర్తిని తప్పుపడుతూ ఇటీవల స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు జయం రవి. తన భార్య,ఆమె కుటుంబం తనని ఆర్థికంగా, మానసికంగా కుంగదీసిందని ఆరోపిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు.. కేవలం నా డబ్బు కోసమే ఆర్తి ఇదంతా చేస్తుందంటూ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ వార్తలు పై ఆర్తి తల్లి ప్రొడ్యూసర్ సుజాత స్పందించారు. ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.. పోస్టులు ఏం రహస్యాలను బయటపెట్టిందో ఒకసారి తెలుసుకుందాం..
జయం రవి – ఆర్తి విడాకుల పై చర్చ..
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది.. ఎంతోమంది సినీ స్టార్స్ విడిపోయారు. గతంలో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జీవి ప్రకాష్ భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇక రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఆయన భార్యతో విడాకులు ప్రకటించాడు. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న వీరిద్దరి విడాకులు వచ్చా ఇప్పుడు వీధికి ఎక్కింది. రోజురోజుకీ విడాకుల చర్చ కుదురుతుంది. జయం రవి అసలు విడాకులు ఎందుకు తీసుకున్నాడు ఏదైనా కారణం ఉందా? భార్య అంతగా టార్చర్ చేసిందా? పిల్లల పరిస్థితి ఏంటి? ఇలాంటి చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇక రీసెంట్గా జయం రవి తన భార్య గురించి సంచలన నిజాన్ని బయట పెట్టాడు.. కేవలం డబ్బుల కోసమే తనని ఇలా చేస్తుందంటూ ఆరోపించాడు. ఆయన చేసిన ఆరోపణలపై ఆర్తి తల్లి స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు..
ఆర్తి తల్లి పోస్ట్ లో ఏముంది..?
జయం రవి అత్త, ఆర్తి తల్లి ప్రొడ్యూసర్ సుజాత తన కూతురి పై అల్లుడు చేసిన ఆరోపణలను తిప్పి కొట్టింది. జయం రవిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని వెల్లడించారు. రూ.100 కోట్లు అప్పులు చేసి మరీ అతనితో సినిమాలు నిర్మించానన్నారు సుజాత. గత ఏడాది కాలంగా అతను తన కుటుంబాన్ని దూరం పెడుతున్నాడని ఆమె ఆరోపించింది. నేను జయం రవితో వరుసగా మూడు సినిమాలు తీశాను, అడంగ మారు, భూమి, సైరెన్. ఈ సినిమాల కోసం, నేను ఫైనాన్షియర్ల నుండి 100 కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకున్నాను. ఆ డబ్బులో 25 శాతం జయం రవికి జీతంగా ఇచ్చాను. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను అతనితో చేసుకున్న ఒప్పందం, అతను తన బ్యాంకు ఖాతాకు చేసిన బదిలీ, నేను అతనికి చెల్లించిన పన్నులు సహా. ఇప్పుడు జయం రవి ఈ సినిమాల విడుదల సమయంలో నా కోట్ల రూపాయల అప్పులకు అతనిని బాధ్యుడ్ని చేశానని తప్పుడు ఆరోపణలు చేశాడు. డబ్బుల కోసం మేమే అతని బాధ్యులం చేశామని అన్నారు కదా దానికి ప్రూఫ్ చూపించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
#Aarti's mother and film producer #SujathaVijayakumar slams actor #RaviMohan pic.twitter.com/rwN9z7nwtA
— Chennai Times (@ChennaiTimesTOI) May 17, 2025