BigTV English

Viswambhara Update : చిరు ‘విశ్వంభర’ మరింత వెనక్కి.. రిలీజ్ పై క్లారిటీ వచ్చేదెప్పుడో..

Viswambhara Update : చిరు ‘విశ్వంభర’ మరింత వెనక్కి.. రిలీజ్ పై క్లారిటీ వచ్చేదెప్పుడో..

Viswambhara Update : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంభర.. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తీస్తోన్న ఈ చిత్రం త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. 2025 సంక్రాంతికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా… ఏవేవో కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.. దీనికి ముఖ్యకారణం వీఎఫ్ఎక్స్.. దీనిపై ఫోకస్ పెట్టడం వల్ల ఎక్కువగా ఆలస్యం అవుతుందని ఓ వార్త గత కొద్ది రోజులుగా మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మరోసారి ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అసలు దీనిపై మేకర్స్ ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం..


టీజర్‌లో గ్రాఫిక్స్‌పై తీవ్ర విమర్శలు..

గతంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ పై మాత్రం విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మేకర్స్ హైదరాబాద్, హాంకాంగ్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తున్నట్లు సమాచారం. టీజర్‌పై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేలా ట్రైలర్‌ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. నిజానికి ఈ సినిమాకు ఖర్చయిన దాంట్లో 75 కోట్లు ఈ గ్రాఫిక్స్ పైనే పెట్టినట్లు సమాచారం. అంటే అర్థం చేసుకోవచ్చు గ్రాఫిక్స్ తోనే సినిమా మొత్తం నడుస్తుంది అని. అయితే ఈ సినిమాను మొదట మేలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు మే నుంచి పోస్ట్ పోన్ అయ్యి జూన్, జూలైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.. ఇప్పుడు ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


Also Read :అల్లుడి మోసాన్ని బయట పెట్టిన అత్త.. ముదురుతున్న విడాకుల పంచాయతీ!

విశ్వంభర మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందా..?

ఈ సినిమాని అనుకున్న టైంలో తీసుకురావాలని మేకర్స్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న దానికంటే చాలా స్లోగా ఉండటం వల్లే రిలీజ్‌పై మేకర్స్ రిలీజ్‌ గురించి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందువల్లే జనవరి, మే, జులై, ఆగస్ట్ ఇలా డేట్స్ మార్చుకుంటూ వస్తున్నారట.. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా సెప్టెంబర్ కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న బాలయ్య సినిమాతో పోటీ పడిపోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..

ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. సోషియో ఫాంటసీ మూవీ గా తెరికెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి లుక్కు అదిరిపోయింది. ఇక కథ కూడా అంతకుమించి ఉంటుందని ఆయన అభిమానులు సినిమాని చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. 35వేల క్రిందట నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ మరోసారి హిట్ టాక్ అని సొంతం చేస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×