E-Paper
Advertisement

Jayam Ravi: హీరోయిన్ తో ఎఫైర్.. భార్యకు విడాకులు.. అసలు నిజం ఇదే

Jayam Ravi: హీరోయిన్ తో ఎఫైర్.. భార్యకు విడాకులు.. అసలు నిజం ఇదే
Advertisement

Jayam Ravi: ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత త్వరగా అవుతున్నాయో విడాకులు కూడా అంతే త్వరగా అయిపోయితున్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సైతం తమ భార్యలతో విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ల మీద షాకులు ఇస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి సైతం తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జయం రవి తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సుపరిచితుడే. పొన్నియన్ సెల్వన్ సినిమాలో టైటిల్ రోల్ పోషించి మెప్పించిన జయం రవి.. ఈ ఏడాది సైరన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. తెలుగులో ఆశించనంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2009 లో వీరి వివాహం జరిగింది.

Advertisement

ఆర్తి ఎవరో కాదు.. టెలివిజన్ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కుమార్తె. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇకపోతే గత కొంతకాలంగా వీరి మధ్య విబేధాలు నెలకొన్నాయని, అంతేకాకుండా జయం రవి .. మరో స్టార్ హీరోయిన్ ప్రేమలో ఉన్నాడని టాక్ నడుస్తోంది. అది తెలిసిన ఆర్తి.. భర్తతో గొడవపడటం వలనే విడాకులకు సిద్దమైనట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ విడాకుల రూమర్స్ పై జయం రవి స్పందించకపోయినా ఆర్తి స్పందించింది.

రవి హీరోగా నటించిన మొదటి సినిమా జయం. తెలుగులో నితిన్ నటించిన జయంకు రీమేక్. ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రవి ఇంటిపేరుగా మారింది. ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్తీ సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. “ప్రేమ అనే పదం… ఇది మాటలు కాదు జీవితం” అని రాసుకొస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి కలతలు లేవని తేలిపోయింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×