E-Paper
Advertisement

టీమిండియాలో అంద‌రూ రాక్ష‌సులే…వాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ప్ర‌పంచ‌మే వ‌ణికిపోతోంది

టీమిండియాలో అంద‌రూ రాక్ష‌సులే…వాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ప్ర‌పంచ‌మే వ‌ణికిపోతోంది
Advertisement

Basit Ali on Indian Batting line-up: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 3rd T20I) మధ్య మంగళవారం జరిగిన మూడవ టీ20 సందర్భంగా అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో 13.2 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయింది. అటు వైపు వైభ‌వ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కూడా ఓపెనర్ గా దిగి 40కి పైగా ప‌రుగులు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ ఆలీ (Basit Ali on Indian Batting line-up) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో అంద‌రూ రాక్ష‌సులేన‌ని..వాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ప్ర‌పంచ‌మే వ‌ణికిపోతోందని వ్యాఖ్యానించారు. అభిషేక్ సిక్స‌ర్లు దెబ్బ‌కు న్యూజిలాండ్ బౌల‌ర్ల‌కు చలి జ్వ‌రం వ‌చ్చిందని వెల్ల‌డించారు. అభిషేక్ శ‌ర్మ బ్యాటింగ్ చూస్తుంటే గూస్ బంప్స్ వ‌చ్చాయని పేర్కొన్నారు. దీంతో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

 అభిషేక్ సిక్స‌ర్లు దెబ్బ‌కు న్యూజిలాండ్ బౌల‌ర్ల‌కు చలి జ్వ‌రం వ‌చ్చింది

న్యూజిలాండ్ జట్టుపై అభిషేక్ శర్మ చేసిన సెంచరీపై బాసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్లాట్ మైదానాలపైన మాత్రమే ఆడతాడని చాలా మంది అభిషేక్ శర్మను ట్రోల్ చేశారని మండిపడ్డారు. కానీ న్యూజిలాండ్ గడ్డపై కూడా అభిషేక్ శర్మ సెంచరీ చేసి, రియల్ హీరో అయ్యాడని వెల్లడించారు. ఫ్లాట్ పిచ్ ల పైనే కాకుండా విదేశీ గడ్డలపై ఇరగదీసి విమర్శకుల నోర్లు మూయించాడని తెలిపారు. వెల్డింగ్టన్ వేదికగా చిన్న బౌండరీలు ఉన్న తరుణంలో అద్భుతంగా వినియోగించుకొని సిక్సర్లు, బౌండరీలతో న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడని పేర్కొన్నారు. ఇలాగే అభిషేక్ శర్మ బ్యాటింగ్ కొనసాగించి.. ఇరగదీయాలని సూచనలు చేశారు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

35 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఒకే ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డ్ సృష్టించి… విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. ఈ క్రమంలోనే టెస్ట్ హోదా కలిగిన దేశాల నుంచి ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా కూడా నిలిచాడు. దీంతో గేల్ రికార్డు బ్రేక్ అయింది. మొత్తంగా ఈ ఫీట్ మూడు సార్లు చేరుకోవడం గమనార్హం. ఆ తర్వాత గేల్, ఫించ్ చె రెండుసార్లు ఈ మార్క్ చేరుకున్నారు. ఇక 15 బంతుల్లో అత్యధిక సార్లు ఫిఫ్టీ చేసిన ప్లేయర్ గా కూడా అభిషేక్ శ‌ర్మ రికార్డు సృష్టించాడు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

 

 

Related News

అభిషేక్ శర్మలా ఆడాల‌ని పాకిస్తాన్ బ్యాట‌ర్లు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు

శ్రీలంక బ్యాట్లలో స్ప్రింగులు… చెక్ చేసిన బాబ‌ర్ ఆజం

టీమిండియాలో మొనగాళ్లే ఉంటే, 6 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయ్యేది

న్యూజిలాండ్ కంటే మేం నయం…టీమిండియాను చిత్తు చేశామంటూ డారెన్ సమీ విమర్శలు!

అభిషేక్ శర్మ సెంచరీ..కోహ్లీ 10 ఏళ్ల రికార్డు బద్దలు, న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం

డారిల్ మిచెల్ భారీ సిక్స‌ర్, జ‌స్ట్ మిస్ లేకుంటే సెక్యూరిటీ తల వెయ్యి ముక్కలు అయ్యేది

టీమిండియా లేడీ క్రికెట‌ర్ల‌కు అవ‌మానం…ప్రైవేట్ పోటోలు లీక్ ?

Big Stories

Advertisement
×