JD Chakravarthy: ఒకప్పటి సీనియర్ నటుడు జే.డి.చక్రవర్తి (J.D.Chakravarthy) అంటే ఇప్పటి జనరేషన్ సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే ఈయన ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే అప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేకపోయినప్పటికీ చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే అలాంటి జే.డీ.చక్రవర్తిని ఓ స్టార్ హీరోయిన్ తల్లి.. నా కూతుర్ని పెళ్లి చేసుకోమంటూ అడిగిందట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ తల్లి ఎవరు..? ఎందుకు అంత పెద్ద హీరోయిన్ తల్లి జెడి చక్రవర్తిని తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగింది? అనేది ఇప్పుడు చూద్దాం.. జే.డీ.చక్రవర్తిని నా కూతుర్ని పెళ్లి చేసుకోమంటూ అడిగింది ఎవరో కాదు దివంగత స్టార్ హీరోయిన్ అయినటువంటి శ్రీదేవి (Sridevi) తల్లి.
జె.డి చక్రవర్తితో తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగిన శ్రీదేవి తల్లి..
శ్రీదేవిని పెళ్లి చేసుకోమని శ్రీదేవి తల్లి చాలాసార్లు జే.డీ. చక్రవర్తి(J.D. Chakravarthy) ని అడిగిందట.అయితే ఈ విషయాన్ని స్వయంగా జేడి చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.. జెడి చక్రవర్తి,రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీ లకు హీరోయిన్ శ్రీదేవి, జయసుధ, రంభ అంటే ఎంతో ఇష్టం అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.అయితే అలాంటి ఎంతో అమితంగా ఇష్టపడే ఒక హీరోయిన్ తల్లి నుండి తమ కూతురిని పెళ్లి చేసుకోమని, పెళ్లి ప్రపోజల్ వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కానీ జెడి చక్రవర్తి మాత్రం సైలెంట్ అయిపోయారట. అయితే శ్రీదేవి(Sridevi)ని పెళ్లి చేసుకోమని స్వయంగా వచ్చి వాళ్ళ తల్లి అడిగినా కూడా ఎందుకు జెడి చక్రవర్తి సైలెంట్ అయిపోయారు అంటే జేడీ చక్రవర్తి దగ్గరికి శ్రీదేవి తల్లి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగింది నిజమే. కానీ అప్పటికి శ్రీదేవి తల్లికి కాస్త హెల్త్ ఇష్యూస్ ఉన్నాయట. ఎందుకంటే ఆమెకి మానసిక స్థితి బాలేదట. ఇక అసలు విషయం ఏమిటంటే.. జెడి చక్రవర్తి శ్రీదేవి చెల్లెలు మహేశ్వరితో కలిసి కొన్ని సినిమాలు చేసారు..
అసలు నిజం చెప్పిన జె.డి చక్రవర్తి..
అలా మహేశ్వరి (Maheshwari)ని కలవడం కోసం జె.డి చక్రవర్తి ఓ రోజు మహేశ్వరి ఇంటికి వెళ్లారట.అయితే అక్కడే శ్రీదేవి తల్లి కూడా ఉండడంతో హ్యాండ్సమ్ గా ఉన్న జెడి చక్రవర్తిని చూసి, ఆయన దగ్గరికి వచ్చి నా కూతురు శ్రీదేవిని మీరు పెళ్లి చేసుకుంటారా? అని అడిగిందట. అయితే ఆ మాటకు జేడీ చక్రవర్తి మనసులో ఎగిరి గంతేయాలి అన్నంత సంతోషం వేసిందట. కానీ అప్పుడే అసలు నిజం తెలిసింది. అదేంటంటే శ్రీదేవి తల్లికి అనారోగ్యం కారణంగా తలకి సర్జరీ జరిగిందట. ఆ సర్జరీ జరిగిన సమయంలో కుడివైపు చేయాల్సిన సర్జరీని ఎడమవైపు చేయడం కారణంగా ఆమె మెంటల్ హెల్త్ కాస్త డిస్టర్బ్ అయిందట. అందుకే మానసిక పరిస్థితి బాలేక ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియకుండా ప్రవర్తించేదట.ఇక ఈ విషయం తెలిసాక జెడి చక్రవర్తి కాస్త నిరాశ పడ్డారట. ఎందుకంటే శ్రీదేవి తల్లి వచ్చి ఏకంగా శ్రీదేవి చేసుకోమని అడిగితే ఎగిరి గంతేయాలి. కానీ ఆమెకు ఉన్న హెల్త్ ఇష్యూ చూసి బాధపడ్డారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా జె.డి.చక్రవర్తి(J.D. Chakravarthy) ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. ఇక శ్రీదేవి తల్లి కేవలం జెడి చక్రవర్తిని మాత్రమే కాదు యాంగ్రీ మ్యాన్ గా టాలీవుడ్ లో పేరున్న రాజశేఖర్ (Rajashekhar) ని కూడా పెళ్లి చేసుకోమని అడిగిందట. అలా ఆమె హెల్త్ బాలేకపోవడం వల్లే ఇలా కొంతమంది హీరోలను తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగేదట.