TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం లో విధులు నిర్వహించే ఉద్యోగి మహా కుంభమేళాలో అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కుంభమేళాకు కోట్లాదిమంది భక్తులు హాజరవుతున్నారు. అయితే మహా కుంభమేళా సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను అక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నమూనా వద్ద విధులు నిర్వహించేందుకు వెళ్లిన ఉద్యోగి అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
మహా కుంభమేళాలో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసింది. కోట్లాదిమంది భక్తులు మహా కుంభమేళాకు వస్తున్న సందర్భంగా శ్రీవారిని దర్శించే భాగ్యం కల్పించాలని ఉద్దేశంతో టీటీడీ తగు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నమూనా ఆలయం వద్దకు సుమారు 200 మందికి పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వెళ్లారు. అయితే సుబ్రహ్మణ్యం అనే ఉద్యోగి బుధవారం నుండి అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం..
ఈ సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు వెంటనే అక్కడే ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. అలాగే స్థానిక పోలీసులు కూడా సుబ్రహ్మణ్యం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కోట్లాదిమంది భక్తులు హాజరైన మహాకుంభమేళాలో ఎవరైనా అదృశ్యమైనా, వెంటనే వారి ఆచూకీ కనుగొనేలా స్థానిక పోలీసులు ఏర్పాట్లు చేశారు. బయటకు వెళ్లిన సుబ్రహ్మణ్యం రహదారి మరచి అదృశ్యమైనట్లు టీటీడీ సిబ్బంది భావిస్తున్నారు.
మహా కుంభమేళాలో అదృశ్యమైన టీటీడీ ఉద్యోగి
కుంభమేళాలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన టీటీడీ ఉద్యోగి సుబ్రహ్మణ్యం
బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన సుబ్రహ్మణ్యం
అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న అధికారులు pic.twitter.com/Fc9b9BhqI7
— BIG TV Breaking News (@bigtvtelugu) January 30, 2025