Jr Ntr 30 Poster : ఫ్యాన్స్ కు దసరా గిఫ్ట్.. దేవర పోస్టర్ అదుర్స్..

Jr Ntr 30 Poster : ఫ్యాన్స్ కు దసరా గిఫ్ట్.. దేవర పోస్టర్ అదుర్స్..

Jr NTR Devara Poster
Share this post with your friends

Jr NTR Devara Poster

Jr Ntr 30 Poster : యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్ క్యారెక్టర్ లో నటించి రికార్డుల మోత మోగించాడు. స్వదేశంలోనే కాక విదేశాల్లో కూడా అవార్డుల మీద అవార్డులు దక్కించుకున్న ఈ మూవీ వచ్చి ఒకటిన్నర సంవత్సరంపైనే గడుస్తుంది. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి మరొక మూవీ రాలేదు. చేతిలో వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నా ..ఇంకా ఏ మూవీ విడుదల చేయలేదు. ఇది ఎన్టీఆర్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయం అయినప్పటికీ రాబోయే మూవీ కోసం వాళ్లు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్.. డైరెక్టర్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పిచ్చ హైప్ మీద ఉన్న ఈ చిత్రం నుంచి మరొక పోస్టర్ దసరా సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ ఒక్క పోస్టర్ చిత్రంపై మరింత ఉత్కంఠను పెంచుతుంది

ఎన్టీఆర్ అభిమానులకు దసరా సందర్భంగా దేవర చిత్ర యూనిట్ నుంచి స్పెషల్ ఫెస్టివల్ ట్రీట్ గా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో కూడా ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఆయుధంపైనే ఎక్కువ ఫోకస్ కలిగేలా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ చేతిలో ఉన్నది ప్రపంచంలోనే డెడ్లిస్ట్ వెపన్ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్ ను బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ .. అదేనండి మొన్న ఆది పురుష్ లో ద్రాక్ష గుత్తులు లాగా 10 తలలు వేసుకొని దశకంఠుడి క్యారెక్టర్ లో వచ్చాడే అతనే.. పోషిస్తున్నాడు.

జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల క్రేజీ కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది. దీంతో ఈ మూవీపై అంచనాలు మొదటి నుంచే భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్న ఈ చిత్రంలో సముద్ర తీరంలోని గ్రామీణ నేపథ్యంలో వ్యక్తిగా కనిపించే ఎన్టీఆర్ లుక్ ఎంతో డిఫరెంట్ గా ఉంది. పండుగ తర్వాత చిత్రానికి సంబంధించిన షూటింగ్ గోవా సముద్ర తీరంలో జరగనున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఎన్టీఆర్ సినిమాలో అతను వాడే ఆయుధాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి దానికి బెస్ట్ ఉదాహరణ సింహాద్రి. ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ డిఫరెంట్ ఆయుధం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి.

షూటింగ్ లేటుగా ప్రారంభమైన శరవేగంతో టార్గెట్ రీచ్ అవ్వాలి అని కొరటాల అండ్ టీం తెగ కుస్తీ పడుతున్నారు. మరి ముఖ్యంగా హీరోకి విలన్ కి మధ్య ఉన్న ఫైటింగ్స్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీకి విక్రమ్, జైలర్ , లియో లాంటి చిత్రాలకు సంగీతం అందించిన యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న హాట్ సమ్మర్ లో ఈ మూవీ పార్ట్ -1 వరల్డ్ వైడ్ గ్రాండ్ విడుదలకు రెడీ అవుతోంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

BJP: కవిత ఢిల్లీ దీక్షకు బీజేపీ కౌంటర్ దీక్ష

Bigtv Digital

Trisha : మన్సూర్ వ్యాఖ్యలపై త్రిష అనూహ్య స్పందన..

Bigtv Digital

Snowstorm : మంచుతుపాను విధ్వంసం.. గడ్డకట్టిన నయాగరా జలపాతం..

Bigtv Digital

Hi Nanna  : హాయ్ నాన్న సెన్సార్ కంప్లీట్..లెంగ్త్ ఏంటో తెలుసా?

Bigtv Digital

KCR: సీఎం కేసీఆర్‌తో TSPSC ఛైర్మన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Bigtv Digital

Indian Cricket Team : వీరే ఇండియా బెస్ట్ ఫీల్డర్లు.. రెండోసారి అవార్డు అందుకున్న శ్రేయాస్..

Bigtv Digital

Leave a Comment