BigTV English
Advertisement

Jr Ntr:- ఎన్టీఆర్‌తో సినిమా చేయాల‌నుంద‌న్న హ‌లీవుడ్ డైరెక్ట‌ర్‌.. ఫ్యాన్స్ ఖుషి

Jr Ntr:- ఎన్టీఆర్‌తో సినిమా చేయాల‌నుంద‌న్న హ‌లీవుడ్ డైరెక్ట‌ర్‌.. ఫ్యాన్స్ ఖుషి

Jr Ntr:- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిచ్చ ఆనందంలో ఉన్నారు. అందుకు కార‌ణం త‌మ అభిమాన హీరోకి హాలీవుడ్ డైరెక్ట‌ర్ నుంచి ప్ర‌శంస‌లు రావ‌ట‌మే. వివ‌రాల్లోకి వెళితే, గ‌త ఏడాది విడుద‌లైన RRR సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ అవార్డ్ కూడా వ‌చ్చింది. ఇందులో తెలంగాణ వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించిన ఎన్టీఆర్‌పై హాలీవుడ్ డైరెక్ట‌ర్ జేమ్స్ గ‌న్ ప్ర‌శంస‌లు కురిపించారు. గార్డియ‌న్ ఆఫ్ గెలాక్సీ చిత్రంతో జేమ్స్ గ‌న్ అంద‌రి దృష్టిని ఆకర్షించారు.


గార్డియ‌న్ ఆఫ్ గెలాక్సీ యూనివ‌ర్స్‌లోకి నెక్ట్స్ తీసుకోవాల‌నుకుంటే ఏ ఇండియ‌న్‌ హీరోని తీసుకుంటార‌ని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో అడిగారు. దానికి ఆయ‌న స‌మాధానం ఇస్తూ.. ‘‘RRR మూవీలో సూపర్‌గా కనిపించిన ఆ హీరో ఎవరు?.. అతని పేరు ఏంటి? పులులతో పాటు బోనులోంచి ఓ వ్యక్తి బయటికి వస్తాడు కదా.. అతనితో కలిసి వర్క్ చేయాలని ఉంది. అతను చాలా అద్ఫుతంగా నటించాడు. ఆ సీన్ చూసి నేను ఫ్యాన్ అయిపోయా’’ అని అన్నారు జేమ్స్. హాలీవుడ్ డైరెక్ట‌ర్ ఇలా త‌మ హీరోని అభినందించ‌టంపై ఆయ‌న ఫ్యాన్స్ సంతోష‌ప‌డుతున్నారు.

ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజీ పాన్ ఇండియా మూవీస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌టానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. దీంతొ పాటు హృతిక్ రోష‌న్‌తో క‌లిసి వార్ 2 మూవీలోనూ యాక్ట్ చేస్తున్నారు తార‌క్‌. ఇది కాకుండా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలోనూ యంగ్ టైగ‌ర్ సినిమా చేయాల్సి ఉంది. ఈ పాన్ ఇండియా క్రేజీ లైనప్ మూవీస్ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాయి.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×