NTR: మార్చి 28న విడుదలైన‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. 2023లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. కళ్యాణ్ శంకర్ రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌లపై హారిక సూర్యదేవర మరియు సాయి సౌజన్య నిర్మించగా, సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ తన బావ మరిది నార్నే నితిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
పోయి సావు
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ గురించి మాట్లాడుతూ.. 2011లో నా పెళ్లి అయింది. అప్పుడు నితిన్ చాలా చిన్నపిల్లవాడు. మామూలుగా నాతో మాట్లాడానికి చాలా భయపడే వాడు. నేను ఇంట్లోకి వస్తే బయటికి వెళ్లిపోయేవాడు. వీడెంటి ఇలా ఉన్నాడు అనుకున్నాను. నేను కూడా చాలా ట్రై చేశాను. వీడు కదా మాట్లాడాలి అని అనుకున్నాను. ఫైనల్‌గా చాలా రోజులకు ధైర్యంగా నా ముందుకి వచ్చి బావ యాక్టర్ అవుతాను అన్నాడు. నేను కూడా అంతే ధైర్యంగా నా సపోర్ట్ నీకు ఉండదు.. పోయి సావు అన్నాను. అయితే చెప్పడం చెప్పాను కానీ, నాకు చాలా భయంగా ఉండేది. సడెన్‌గా యాక్టింగ్ అంటున్నాడు.. నలుగురు ఐదుగురు మధ్య వ్యక్తుల మధ్య ఇంట్లో ఉండే వ్యక్తి బయటికి వెళ్తున్నాడు. తన కెరీర్ ఎలా ఉంటుందనే ఓ భయం ఉండేది. కానీ ఏరోజు ఏమి అడగలేదు. నీకు కావాల్సిన ఫ్రీడమ్ తీసుకో. తను చేసుకుంటూ వెళ్లాడు. ఈరోజు తనని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మంచి దర్శకులతో, మంచి నిర్మాతలతో ఇలాగే ముందుకు సాగుతూ ఉండు.. ఇంటికెళ్లాక నీతో మాట్లాడతాను.. అని సరదాగా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.
మ్యాడ్ దర్శకుడు చేసిన పనికి వెళ్లిపోతాను అన్న ఎన్టీఆర్!
ఇక చాలా కాలమైంది మనందరం కలుసుకొని.. ఈరోజు వంశీ పుణ్యాన కలుసుకున్నాం. నవ్వించడం ఒక వరం. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించినందుకు దర్శకుడు కళ్యాణ్ శంకర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కళ్యాణ్ ఎన్టీఆర్ కాళ్లకు దందం పెట్టబోయాడు. దానికి ఎన్టీఆర్.. ఇలా అయితే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. దండం పెడితే అమ్మ నాన్నలకు మాత్రమే పెట్టాలని అన్నారు. అలాగే.. ఈ సినిమాలో నటించిన సంగీత్ శోభన్, రామ్ నితిన్ గురించి మాట్లాడుతూ.. నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉన్నారు.. అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.