Alekhya Chitti Pickles Issue: నిన్న మొన్నటి వరకు పాస్టర్ పగడాల ప్రవీణ్ ఇష్యూ ఇరు రాష్ట్రాల్లలో హాట్ టాపిక్ గా కొనసాగగా.. ఇప్పుడు దాన్ని సైడ్ ట్రాక్ చేసి అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం ట్రెండింగ్ లోకి వచ్చింది. పచ్చళ్ల బిజినెస్ మునుసుగులో కస్టమర్లతో అలేఖ్య మాట్లాడిన జుగుప్సాకరమైన మాటలకు సంబంధించిన ఆడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంతకాలం వారి పచ్చళ్ల బిజినెస్ ను కొనియాడిన వాళ్లే.. ఇప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. గతంలోనూ అలేఖ్య చాలా మందిని ఇలాగే తిట్టిందని, ఇప్పుడిప్పుడే ఆమె వ్యవహారాలు బయటకు వస్తున్నాయంటున్నారు.
అలేఖ్య సిస్టర్స్ కు కొత్త సమస్య!
అలేఖ్య వివాదంపై సోషల్ మీడియాలో జోక్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. అదిరిపోయే మీమ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా నెటిజన్లు అలేఖ్య సిస్టర్స్ ముందుకు కొత్త డిమాండ్ ను తీసుకొచ్చారు. “తిట్టిన అమ్మాయి, తిట్టించుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. లేదంటే, అలేఖ్య సిస్టర్స్ లో ఒకరు ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే, ముష్టి పికెల్స్ కొనలేని వాడంటూ.. అతడిని సమాజం ముందు నిలబెట్టింది. అతడి పరువు తీసింది. అతడికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఏ అమ్మాయి కూడా అతడిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడదు. ఈ సమస్య నుంచి అతడు బయటపడాలంటే, అలేఖ్య సిస్టర్స్ లో ఒకరు అతడిని పెళ్లి చేసుకోవడమే మంచిది” అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
Read Also: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలోకి ట్రంప్ మామ ఎంట్రీ.. బ్యాన్ చేస్తారట!
పచ్చళ్ళ పంచాయితీలో పాపారాయుడు తీర్పు..#alekhyachittipickles #alekhyaachittipickles #Alekhyachitti pic.twitter.com/ISPkRkkZfl
— Suresh Swayambarapu (@sureshsayz) April 4, 2025
Read Also: ఒసేయ్.. నీకెందుకే పచ్చళ్లు.. పాచిపని చేస్కో.. అలెఖ్య మరో ఆడియో లీక్!
#AlekyaChittiPickles #alekhyachittipickles pic.twitter.com/Oispywb92k
— Deva Reddy (@deva_reddy45) April 4, 2025
Read Also: అవును తిడతాం.. అలేఖ్య చెల్లి రమ్య షాకింగ్ కామెంట్స్!
ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు
ఇక ఈ డిమాండ్ ను చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ఈ డిమాండ్ నిజంగా చాలా బాగుంది. అప్పుడే ఆ యువకుడికి న్యాయం జరుగుతుంది. పికెల్స్ కు కూడా జస్టిస్ దొరుకుతుంది” అని ఓ నెటిజన్లు కామెంట్ చేశాడు. “ఒక వేళ ఆ అమ్మాయి అతడిని పెళ్లి చేసుకుంటే.. వాడి బాడీతో 60 కేజీల నాన్ వెజ్ పచ్చడి పెట్టి, కిలో రూ.3,000 చొప్పున అమ్మేస్తుంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “వద్దు రా బాబూ.. ఆమెను చేసుకుంటే ఉన్న జీవితం నాశనం చేసేస్తుంది” అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. మొత్తంగా అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మీమర్స్ కు కొద్ది వారాల పాటు సరిపడ స్టఫ్ ను అందించింది. అలేఖ్య గతంలో చేసిన వీడియోలు, మాటలను వెతికి మరీ బయటకు తీసి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి అలేఖ్య అక్క సుమ, చెల్లి రమ్య సోషల్ మీడియా వేదికగా వీడియోలు విడుదల చేశారు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, వారి మాటలను నెటిజన్లు లైట్ తీసుకుంటున్నారు. గతంలో వాళ్లు పెట్టిన కామెంట్స్ కూడా వల్గర్ గా ఉండటంతో ఎవరూ సానుభూతి చూపించే ప్రయత్నం చేయడం లేదు. కస్టమర్లను నోటికి వచ్చినట్లు తిట్టినప్పుడే ఉన్న కాస్త గౌరవం పోయిందంటున్నారు.
Read Also: ఏంటీ అలేఖ్య పచ్చళ్లు తింటే.. గర్భం వస్తుందా?