BigTV English
Advertisement

NTR: ఆ విషయంలో భార్యతో ఎన్టీఆర్ గొడవ.. ఇంత దారుణమా.. ?

NTR: ఆ విషయంలో భార్యతో ఎన్టీఆర్ గొడవ.. ఇంత దారుణమా.. ?

NTR: భార్యాభర్తలు అన్నాక గొడవలు సాధారణమే.  నిజం చెప్పాలంటే ఆ బంధంలో గొడవలు లేకపోతేనే ఇబ్బంది పడాలి. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు వారి మధ్య ఉన్న బంధాన్ని   మరింత బలంగా మారుస్తాయి. మరీ విడిపోయేంత గొడవల గురించి మనం మాట్లాడుకోవడం లేదు కానీ, ఇంట్లో రోజు జరిగే చిన్న చిన్న గొడవల గురించి మాత్రమే చర్చించుకుంటున్నాం. అయితే ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతమేమి కాదు.  మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైతం తన భార్య లక్ష్మీ ప్రణతితో గొడవలు పడుతూ ఉంటాడట.


తాజాగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్  టాక్ ను అందుకున్న విషయం తెల్సిందే. మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా.. కలక్షన్స్ విషయంలో మాత్రం రికార్డులను తిరగరాస్తుంది. ఇక దేవర ప్రమోషన్స్ కోసం.. ఎన్టీఆర్ కొన్నిరోజుల క్రితం ముంబై  వెళ్లిన విషయం విదితమే. దేవర టీమ్ అంతా కలిసి కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఎన్టీఆర్ తో పాటు   జాన్వీ కపూర్, సైఫ్ ఆలీఖాన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు తెలుగుతో పాటు చాలా భాషలు వచ్చు అన్న విషయం అందరికి తెల్సిందే. తమిళ్ కు వెళ్తే తమిళియన్ అయిపోతాడు. కన్నడ వెళ్తే కన్నడియన్ గా మారతాడు.

ఇక బాలీవుడ్ లో ఉన్నవాళ్లు కూడా ఎన్టీఆర్ లా హిందీ మాట్లాడరేమో అనిపించక మానదు.  ఈ షోలో ఎన్టీఆర్ హిందీకి.. బాలీవుడ్ ఫ్యాన్సే షాక్ అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ  షోలో అర్చన పురాణ్ సింగ్.. ఎన్టీఆర్ ను తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి ఒక ప్రశ్న అడిగింది. ” ఎన్టీఆర్..  మీ భార్యతో మీకు ఎప్పుడైనా గొడవ జరిగిందా.. ?  ఒకవేళ అయితే దేని గురించి జరుగుతుంది” అని అడగ్గా.. ఎన్టీఆర్ తడుముకోకుండా ఏసీ గురించి అని చెప్పుకొచ్చాడు.


” నాకు, ప్రణతికి ఎప్పుడు  ఏసీ గురించి గొడవ అవుతుంది. ఎప్పుడు నేనే గెలుస్తాను. అస్సలు కాంప్రమైజ్  కాను. ఎందుకంటే.. ప్రణతి  చాలా సైలెంట్. గొడవలకు దూరంగా ఉంటుంది. చాలా స్వీట్ పర్సన్” అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసాక.. ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అన్నా.. ఇది దారుణం అన్నా. వదిన సైలెంట్ అని ఇలా చేయకూడదు. అప్పుడప్పుడు వదినమ్మను కూడా గెలిపించు అన్నా అని అంటుంటే.. ఇంకొందరు మాత్రం మేము ఇలా గొడవపడితే .. బయట ఉంటాం అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం..  2011 లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రణతి   గృహిణిగానే ఉంటూ.. పిల్లల బాగోగులను చూసుకుంటుంది. ఆమె  కెమెరా కంట పడడం కూడా చాలా రేర్. ఎన్టీఆర్ తో తప్ప ప్రణతి బయట ఎక్కడ  కనిపించదు. టాలీవుడ్ లో అడోరబుల్ కపుల్స్ లిస్ట్ లో ఎన్టీఆర్, ప్రణతి జంట టాప్ 5 లిస్ట్ లోనే ఉంటారు. వారెప్పుడు  అలానే ఉండాలని అభిమానులు సైతం కోరుకుంటూ ఉంటారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×