E-Paper
Advertisement

Ka Mass Jathara: ‘క’మాస్ జాతర.. కిరణ్ అన్న డ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ

Ka Mass Jathara: ‘క’మాస్ జాతర.. కిరణ్ అన్న డ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ
Advertisement

Ka Mass Jathara: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఏడాది తరువాత నటిస్తున్న చిత్రం క(KA). సుజీత్ మరియు సందీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నాడు.  ఇక ఈ సినిమాలో కిరణ్ సరసన నయన్ సారిక, తాన్వి రామ్ నటిస్తున్నారు. కిరణ్ మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా క తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కుతున్న క.. త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా క చిత్రం నుంచి మాస్ జాతర వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన కిరణ్ ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్న కిరణ్ అబ్బవరం మరో ఎత్తులా కనిపిస్తున్నాడు.  మాస్ జాతర సాంగ్ లో కిరణ్ అబ్బవరం డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి.

Advertisement

ఆడు.. ఆడు.. ఆడు.. నిలువెల్లా పూనకమై ఆడు సాగిన ఈ సాంగ్ కు సామ్ CS సంగీతం అందించగా.. సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ అందించాడు. ఇక దివాకర్, సామ్ CS  తమ బేస్ వాయిస్ తో సాంగ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లారు. ఇదొక జాతరలో వచ్చే సాంగ్ లా కనిపిస్తుంది.  జాతరలో హీరో, హీరోయిన్స్ అందరూ .. పూనకాలు వచ్చేలా డ్యాన్స్ వేస్తూ కనిపించారు. ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం ఈ రేంజ్ లో డ్యాన్స్ చేయడం ఎవరు చూడలేదు అనే చెప్పాలి. 

కొరియోగ్రాఫర్ విజయ్.. కిరణ్ తో మాస్ స్టెప్స్ వేయించి అరిపించాడు.  ఇకనుంచి ప్రతి మాస్ జాతరలో ఈ సాంగ్ కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. టోటల్ గా మాస్ జాతర.. థియేటర్ లో పూనకాలు తెప్పించే విధంగానే ఉంది. ఈ సాంగ్ తో క సినిమాపై ఇంకా హైప్ వచ్చిందనే చెప్పాలి. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×