E-Paper
Advertisement

Ka Movie collections : అదరగొట్టిన కిరణ్ అబ్బవరం.. బాక్సాఫీస్ ను దున్నెస్తున్న ‘క ‘ మూవీ..

Ka Movie collections : అదరగొట్టిన కిరణ్ అబ్బవరం.. బాక్సాఫీస్ ను దున్నెస్తున్న ‘క ‘ మూవీ..
Advertisement

Ka Movie collections : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ( kiram Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ ‘ క ‘.. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా సరికొత్త కథతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. మూడు రోజులకు గాను భారీ కలెక్షన్ ను అందుకుంది.. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు.. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా తన్వి రామ్ ముఖ్య పాత్రలో సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వం లో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం లో తెరకెక్కిన క సినిమా రికార్డులా మోత మొగిస్తుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా కాసులను వసూల్ చేస్తుంది. ఇక మూడు రోజులకు గాను ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కిరణ్ అబ్బవరం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకేక్కిన’ క ‘ మూవీ.. ఎవరూ ఊహించలేని క్లైమాక్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసారు క సినిమాతో. దీంతో క సినిమాకు థియేటర్స్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. దీనికి తోడు దీపావళి సెలవులు కూడా కలిసి రావడంతో క కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ డే అస్సలు ఊహించని రేంజులో ఏకంగా ఆరు కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కిరణ్ అబ్బవరం లైఫ్ లో ఎప్పుడు చూడని రికార్డ్ ను అందుకోవడం విశేషం.. కిరణ్ అబ్బవరం కు ఇది మామూలు విషయం కాదు. కథ కొత్తగా ఉండటంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి సస్పెన్స్ జోనర్ లో వచ్చిన ప్రతి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ మూవీకి రెస్పాన్స్ మాములుగా లేదనే చెప్పాలి. స్క్రీన్స్ పెంచడం మామూలు విషయం కాదు.

Advertisement

మొదటి రోజు లాగే రెండో రోజు కూడా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేసింది. కిరణ్ అబ్బవరం క సినిమా రెండు రోజుల్లో ఏకంగా 13.11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది కిరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్. రెండు రోజుల్లోనే క సినిమా 13 కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఈ వీకెండ్ ను క్యాష్ చేసుకొనే అవకాశం కూడా ఉంది. అనుకున్నట్లుగానే థియేటర్లు సరిపోలేదనే టాక్ వినిపించింది. పబ్లిక్ డిమాండ్ మేరకు నిన్న మేకర్స్ మరో 186 స్క్రీన్స్ ను పెంచినట్లు తెలుస్తుంది. అంటే రికార్డులు ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ఇక మూడు రోజులకు గాను కలెక్షన్స్ భారీ వసూల్ చేసిందని తెలుస్తుంది. మూడు రోజులకు గాను మరో 7 కోట్లు రాబట్టిందని టాక్ నడుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మూవీ 20 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుందనే టాక్.. ఇక ఈ ఆదివారం ఇంకాస్త కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. నాలుగు రోజులకు 30 కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈజీగా వంద కోట్లు రాబట్టే అవకాశాలు లేకపోలేదు. మరి ఎంత రాబడుతుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×