E-Paper
Advertisement

OTT Bold Movie : ఫోన్ చేసి మరీ రెచ్చగొట్టే అమ్మాయిలు… కరువులో ఉన్నాం కదా అని కాల్ మాట్లాడితే నరకమే

OTT Bold Movie : ఫోన్ చేసి మరీ రెచ్చగొట్టే అమ్మాయిలు… కరువులో ఉన్నాం కదా అని కాల్ మాట్లాడితే నరకమే
Advertisement

OTT Bold Movie : టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ప్రైవసీ అనేది తగ్గిపోతూ వస్తోంది. ఎక్కడ సీక్రెట్ కెమెరాలు ఉంటాయి? అనే విషయం అర్థం చేసుకోవడం ఇప్పుడున్న డిజిటల్ యుగంలో చాలా కష్టం. ఇలా సీక్రెట్ కెమెరాలకు సంబంధించిన ఓ స్కాం నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయంలోకి వెళ్తే….

ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమింగ్…

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వెబ్ సిరీస్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎంతోమంది ప్రైవేట్ వీడియోలు సీక్రెట్ కెమెరాల వల్ల బయటకు వచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరీస్ కూడా ఇలాంటిదే.  ప్రస్తుతం ఈ సిరీస్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel extreme) అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ పేరు “వీడియో క్యాం స్కాం” (Video CAM SCAM ). ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్లు ఉంటాయి.

కథలోకి వెళ్తే…

Advertisement

మూవీ మొదట్లోనే రామ్ అనే అబ్బాయి తన ఫోన్ లో వీడియోను చూసి కంగారు పడతాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన క్లాస్మేట్ అండ్ రూమ్మేట్ తన ప్రైవేట్ వీడియోని తీసి, నెట్ లో వైరల్ చేస్తానంటూ భయపెడుతున్నాడని కంప్లైంట్ చేస్తాడు. దీంతో ఓ పోలీస్ ఆఫీసర్ కాలేజీకి వెళ్లి వాడి కొట్టి ఆ వీడియోని డిలీట్ చేయిస్తాడు. ఆ తర్వాత ఓ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు కలిసి సపరేట్ గా ఓ యాప్ ని మెయింటైన్ చేస్తారు. ఇద్దరమ్మాయిలు అబ్బాయిలకి వీడియో కాల్స్ చేయడమే కాకుండా, వాటిని రికార్డ్ చేసి నెట్లో అప్లోడ్ చేస్తామంటూ బాధితులను భయపెడతారు. ఇలా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు ఈ ముగ్గురూ. ఈ క్రమంలోనే ఓ బిజినెస్ మాన్ ఫోన్ కి అలాంటి వీడియోతో పాటు తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తామని మెసేజ్ వస్తుంది. దీంతో అతను ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఈ క్రమంలోనే ఈ యాప్ ని రన్ చేస్తున్న వాళ్లు ఒక లింక్ ని గూగుల్ లో షేర్ చేస్తారు. ఎవరైనా ఆ లింక్ ని క్లిక్ చేశారంటే వెంటనే వీడియో కాల్ కనెక్ట్ అవుతుంది.

అయితే ఒకానొక సందర్భంలో పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఆ లింకుని క్లిక్ చేస్తాడు. ఒక అమ్మాయి ముందు బాగా మాట్లాడి ఆ తర్వాత బట్టలు విప్పడం మొదలు పెడుతుంది. దీంతో కంగారుపడి హీరో కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మళ్లీ గుర్తొస్తే ఈ లింక్ క్లిక్ చెయ్ అంటూ ఓ మెసేజ్ చేస్తారు. హీరో ఇగ్నోర్ చేయడంతో మళ్లీ కాల్స్ కూడా చేస్తారు. కానీ ఆయన అవేమీ పట్టించుకోడు. మరోవైపు వీడియో కాల్స్ మాట్లాడుతున్న వారందరికీ బ్లాక్ మెయిల్  మెసేజెస్ పంపుతారు. ఇంకోవైపు ఓ హ్యకర్ ఆ యాప్ కు సంబంధించిన వారిపై ఒక కన్ను వేసి ఉంచుతాడు. అయితే అంతలోనే హీరోకి ఓ వీడియో వస్తుంది. ఆ వీడియోలో హీరో ఫేస్ ని ఏఐతో రీప్లేస్ చేసి అతను సెల్ఫ్ గా సంతృప్తి చెందుతున్నట్టు క్రియేట్ చేస్తారు. తము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తామని హెచ్చరిస్తారు.  మరి ఇంతకీ చివరికి ఆ పని చేసింది ఎవరు అనే విషయాన్ని హీరో కనిపెట్టగలిగాడా? అసలు ఈ గ్యాంగ్ అంతా కలిసి ఎందుకు అందర్నీ ఇలా ఫేక్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? చివరికి ఈ స్టోరీ ఎలాంటి టర్న్ తిరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కెయ్యండి.

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×