E-Paper
Advertisement

Kalinga: కళింగ.. ఇదేదో ఆసక్తి రేకెత్తించేలా ఉందే

Kalinga: కళింగ.. ఇదేదో ఆసక్తి రేకెత్తించేలా ఉందే
Advertisement

Kalinga:ప్రస్తుతం ఆడియెన్స్ టేస్ట్ మారిపోయింది. రొటీన్ మాస్ మసాలా కమర్షియల్స్ కంటే కంటెంట్, కాన్సెప్ట్ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. హీరోను చూసి కాదు కథను చూసి థియేటర్ కు వస్తున్నారు. కథలో దమ్ము ఉంటే ఆ సినిమా హిట్ కాకుండా ఎవరు ఆపలేరు. ఇప్పుడు వచ్చే కుర్ర హీరోలు కూడా అదే ఫార్ములాను ఎంచుకుంటున్నారు. కొత్త కథలతో ప్రేక్షకులను అలరించడానికి కష్టపడుతున్నారు.

ఇక కిరోసిన్ అనే సినిమాతో ధృవ వాయు అనే కుర్రాడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. ఓటిటీలో మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. ఇక ఇప్పుడు ధృవ మరోసారి కొత్త కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. అతను హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కళింగ. ఇంకా విశేషం ఏంటంటే ధృవనే ఈ సినిమాకు దర్శకత్వం వహించడం. బిగ్ హిట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను లెజెండరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. కళింగ అనే టైటిల్‌, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఉగ్రరూపంలో ఉన్న నరసింహ స్వామి విగ్రహం ముందు హీరో ధృవ కాగడా పట్టుకొని ఇంటెన్సివ్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×