BigTV English
Advertisement

Kalki 2898 AD Collections: ప్రభాస్ మరో రికార్డు.. కలెక్షన్ల కింగ్ ‘కల్కి’.. మొత్తం ఎంత కలెక్ట్ చేసిందంటే?

Kalki 2898 AD Collections: ప్రభాస్ మరో రికార్డు.. కలెక్షన్ల కింగ్ ‘కల్కి’.. మొత్తం ఎంత కలెక్ట్ చేసిందంటే?

Kalki 2898 AD has collected Rs.363.09 crore share and Rs.750 crore gross in 8 days: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దుమ్ముదులిపేస్తుంది. ప్రాంతాలు, భాషలతో సంబంధం లేకుండా అందరినీ అలరిస్తోంది. ఇప్పటికే రికార్డు కలెక్షన్లతో పరుగులు తీస్తున్న కల్కి తాజాగా మరో రికార్డును కొళ్లగొట్టింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన కొత్త ప్రపంచమే ‘కల్కి 2898 ఏడీ’. అతడి క్రియేటివిటీకి సినీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. హాలీవుడ్ మూవీలకు ఏ మాత్రం తీసుపోని విజువల్ ఎఫెక్ట్స్‌తో టాలీవుడ్‌ రేంజ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. నిజంగా ఇలాంటి క్రియేటివి ఉన్న దర్శకుడు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఉండటం గర్వించదగ్గ విషయమని సినీ ప్రేక్షకులు కొనియాడుతున్నారు. అతడి క్రియేటివిటీతో ప్రభాస్‌ కటౌట్‌కి సరిపడా పాత్రని అందించి దాన్ని తీర్చిదిద్దిన తీరు అత్యద్భుతంగా ఉంది.

అంతేకాకుండా ఈ మూవీలో అశ్వద్దామ పాత్రలో నటించిన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన మాస్ యాక్షన్‌ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఆజానుభావుడిలా కనిపించి దుమ్ము దులిపేశాడు. సినిమాలో ప్రభాస్ – అమితాబ్ బచ్చన్‌ల మధ్య వచ్చే యాక్షన్ సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. అంతేకాకుండా థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించాయి. మహాభారతానికి, కలియుగానికి ముడి చేసి చూపించిన తీరుకు దర్శకుడికి సెల్యూట్ చేయాల్సిందే అని అంటున్నారు.


Also Read: ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల రికార్డు..ఎంత వసూళ్లు చేసిందంటే!

మొత్తంగా కంటెంట్, క్రియేటివిటీ, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ప్రతీ ఒక్క ఎలిమెంట్స్ అత్యద్భుతంగా ఉండటంతో సినిమా సెన్సెషనల్ టాక్‌తో దూసుకుపోతోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ అదే రేంజ్‌ రెస్పాన్స్‌తో అదరగొడుతోంది. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా నిర్మాత అశ్వినీ దత్‌కు లాభాల పంట పండిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం నైజాంలో రూ.100 కోట్ల గ్రాస్ వసూళు చేసి అబ్బురపరచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.242 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే బాలీవుడ్‌లోనూ దుమ్ము దులిపేసింది. అక్కడ రూ.164 కోట్లు కలెక్ట్ చేసింది. ఇటు అటు తమిళంలోనూ రూ.24 కోట్లు రాబట్టింది. మలయాళంలో రూ.15 కోట్లు, కన్నడలో రూ.25 కోట్లు కొల్లగొట్టి ప్రభాస్ మునుపటి సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాకుండా ఓవర్సీస్‌లో $14.5 మిలియన్ల గ్రాస్‌తో ఆల్‌ టైమ్ ఫాస్టెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఇలా తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ.. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ప్రభాస్ కల్కితో దూసుకుపోతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 8 రోజుల్లో రూ.363.09 కోట్ల షేర్, రూ.750 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అదరగొడుతోంది. ఇక ఇవాళ, రేపు సెలవులు కావడంతో బాక్సాఫీసు మరింత కలకలలాడుతూ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×