BigTV English

Britain PM Keir with Himanshu: బ్రిటన్ ప్రధాని కీర్‌తో కేసీఆర్ మనవడు హిమాన్షు, ఆపై అభినందనలు

Britain PM Keir with Himanshu: బ్రిటన్ ప్రధాని కీర్‌తో కేసీఆర్ మనవడు హిమాన్షు, ఆపై అభినందనలు

Britain PM Keir with Himanshu(Today’s international news): పుష్కరకాలం తర్వాతే బ్రిటన్‌లో అధికారం మారుతోంది. రెండురోజుల కిందట జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్ట నున్నారు. ఈ క్రమంలో కొత్త ప్రధాని కీర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రపంచదేశాల నేతలు ఆయనకు ఫోన్ చేసి కొందరు, మరికొందరు సోషల్‌మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. అందులో ఒకరు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు.


బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్‌ శుభాకాంక్షలు చెప్పాడు కేసీఆర్ మనవడు హిమాన్షు. గతంలో లండన్‌లోని హౌస్ ఆఫ్ కామర్స్‌లో అకడమిక్ స్టడీలో భాగంగా ఆయనను కలుసుకున్నాడు. ఈ క్రమంలో తీసిన ఫోటోను షేర్ చేస్తూ.. ఇది తనకు గౌరవంగా ఉందని రాసుకొచ్చాడు హిమాన్షు. మనవడు షేర్ చేసిన పోస్టుకు ఆయన తాత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫుల్‌ఖుషీ అయ్యారు. తన మనవడికి ముందు చూపు ఎక్కువని సన్నిహితులతో చెప్పి ఉప్పొంగిపోతున్నారు.

తొమ్మిదేళ్ల కిందట అంటే 2015 ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కీర్ స్టార్మర్. ఉత్తర లండన్ నుంచి ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2020లో లేబర్ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత యూకేలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజ యం సాధించింది.


ALSO READ:  బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతిదే హవా.. మొత్తం ఎంతమంది గెలిచారంటే..?

కాబోయే ప్రధాని బాల్యమంతా లండన్‌ శివార్లలో గడిచింది. తండ్రి టూల్ మేకర్ కాగా, తల్లి ఓ కంపెనీలో పని చేసేవారు. అంచెలంచెలుగా చదువుకున్న కీర్, న్యాయ విద్యను అభ్యసించారు. ఈ క్రమంలో ఐర్లాండ్ పోలీసులకు మానవహక్కుల సలహాదారుగా వ్యవహరించారు. న్యాయవృత్తిలో ఆయన చేసిన సేవలకు 2014లో రాణి ఎలిజెబెత్ 2 నుంచి నైట్‌హుడ్ పురష్కారం అందుకున్నారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×