BigTV English

Kalki Collections: ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల రికార్డు..ఎంత వసూళ్లు చేసిందంటే!

Kalki Collections: ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల రికార్డు..ఎంత వసూళ్లు చేసిందంటే!

Kalki 2898 AD Collections record(Telugu film news): టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొంద, మాళవిక నాయర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాలతో ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తాజాగా, ఈ సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.700కోట్లకుపైగా వసూళ్లు చేసిందని మేకర్స్ ప్రకటించారు.


కల్కి మూవీ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. హీరో లేకుండా దీపికా పదుకొణె పాత్రకు సంబంధించిన లుక్ ఆకట్టుకుంటోంది. సినిమాలో అశ్వత్థామగా అమితాబ్.. సుప్రీం యాస్కిన్‌గా కమల్ హాసన్, బౌంటీ ఫైటర్ భైరవగా ప్రభాస్ సందడి చేశారు. చివరిలో కర్డుడిగా కనిపించి పార్ట్ 2పై ప్రభాస్ మరిన్ని అంచనాలు పెంచేశారు. ఈ సినిమా విజివల్ వండర్ అని, మరో మూడు రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంతకుముందు ఉన్న రికార్డులను సైతం కల్కి బ్రేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 15 సినిమాల జాబితాలో ఉన్న రజనీకాంత్ జైలర్, దళపతి విజయ్ లియో‌ల రికార్డులను బ్రేక్ చేసింది. జైలర్ లాంగ్ రన్ టైమ్ లో రూ.550కోట్లు, లియో రూ.612 కోట్ల వరకు ఉండగా.. కల్కి ఈ రికార్డులను బ్రేక్ చేసింది. ఇక నార్త్ అమెరికాలో కల్కి అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది.


Also Read: నీల్ మావా ఫోకస్ అంతా డ్రాగన్ మీదనే.. ?

కల్కి సినిమా తెలుగు రాష్ట్రాల్లో అదరగొడుతోంది. ఇప్పటికే రూ.200కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక, హైదరాబాద్ విషయానికొస్తే.. హైదరాాబాద్‌లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో రికార్డు సెట్ చేసింది. గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్‌లో మొత్తం 7 స్క్రీన్స్ ఉండగా.. ఇప్పటివరకు 40 షోల వరకు వేశారు. అయితే వేగంగా రూ.కోటి గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మూవీ కల్కి పేరిట సరికొత్త రికార్డు నమోదైంది.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×