E-Paper
Advertisement

Prabhas: ‘కల్కి 2898 ఏడీ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

Prabhas: ‘కల్కి 2898 ఏడీ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
Advertisement

Prabhas Kalki 2898 AD update

Prabhas Kalki 2898 AD update(Today tollywood news): పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇటీవలే సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు కల్కి మూవీతో రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

Advertisement

ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ప్రభాస్ మాస్ లుక్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో అందరినీ ఆకట్టుకుంది.

సైన్స్, పురాణాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. కాగా ఇందులో భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఈ మూవీలో భాగం అవడంతో సినిమా ఏ రేంజ్‌లో ఉందబోతుందో అందరికీ బాగా అర్థం అవుతోంది.

Advertisement

READ MORE: ‘కల్కి 2898 ఏడీ’ నుండి ప్రభాస్ ఫొటో లీక్.. చూడండి ఎలా ఉన్నాడో..?

ఈ మూవీ ఈ ఏడాది సమ్మర్‌కి రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఆల్మోస్ట్ ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్‌ను అందించారు.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ గురించి తాజా అప్డేట్‌లను మూవీ యూనిట్ తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను వదిలారు. కల్కి 2898 ఏడీ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా దీపికా పదుకొనే నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్‌గా దిశా పటానీ నటిస్తోంది.

అయితే తాజాగా డార్లింగ్ ప్రభాస్, దిశా పటానీ పై ఓ సాంగ్‌ను చిత్రీకరించడానికి మూవీ యూనిట్ ఇటలీకి వెళ్లింది. అక్కడ కల్కి అఫీషియల్ అకౌంట్‌లో అందుకు సంబంధించిన ఫొటోను పంచుకుంది. ‘‘ఎ డార్లింగ్ పిక్.. ఇటలీ డైరీస్.. ప్రభాస్ – దిశా పటానీ’’ అంటూ ఫొటోలను షేర్ చేశారు.

READ MORE: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై దర్శకుడు క్రేజీ అప్డేట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

అక్కడ లొకేషన్లలో షూటింగ్ కోసం రెడీ అవుతున్న ప్రభాస్ – దిశా పటానీల ఫొటోలను పంచుకున్నారు. అందులో ప్రభాస్ చలికోటు ధరించి కనిపిస్తున్నాడు. అలాగే దిశా పటానీ కూడా చలికి వెచ్చని దుప్పటి లాంటి కోటు కప్పుకుని కనిపించింది. అయితే అది బీచ్ లోకేషన్ కావడంతో చలికి బాగా వణికిపోతున్నట్లు వాళ్లని చూస్తే అర్థం అవుతోంది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ప్రభాస్‌ను చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కాగా ఈ సినిమా మే 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×