BigTV English

Kuldeep Yadav Records: పిచ్ పై పట్టు దొరికితే వదలడు.. కులదీప్ 50 వికెట్ల రికార్డ్

Kuldeep Yadav Records: పిచ్ పై పట్టు దొరికితే వదలడు.. కులదీప్ 50 వికెట్ల రికార్డ్

 


Kuldeep yadav latest records

Kuldeep Yadav latest records(Sports news headlines): చైనామన్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ కి పిచ్ మీద పట్టు దొరికిందంటే ఇక ప్రత్యర్థుల పని అవుట్ అని చెప్పాలి. ఇంగ్లాండ్ తో ధర్మశాలలో  జరిగిన ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో హీరో ఎవరంటే కులదీప్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీసి, ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. అంతేకాదు 50 వికెట్ల క్లబ్ లో చేరాడు. 12 మ్యాచ్ ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. అయితే అతి తక్కువ బాల్స్ లో 50 వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు.

1871 బంతులను విసిరి 50 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను అక్షర్ పటేల్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. అక్షర్ 2205 బంతుల్లో ఈ ఘనతను అందుకున్నాడు.


నిజానికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలు పెట్టిన తర్వాత 17 ఓవర్ల వరకు వికెట్ పడలేదు. అప్పుడు తొలి బ్రేక్ ని కులదీప్ ఇచ్చాడు. బెన్ డకెట్ ముందుకొచ్చి కొట్టడంతో అది ఎక్స్ ట్రా కవర్ మీదుగా ఎగిరింది. గిల్ దానిని అద్భుతంగా క్యాచ్ పట్టాడు. తర్వాత రెండో వికెట్ తనే తీశాడు. క్రాలీ బౌల్డ్ అయ్యాడు. పోప్ స్టంపౌట్ అయ్యాడు. స్టోక్స్ ఎల్బీ అయ్యాడు. అలా ముగ్గురిని మూడు రకాలుగా అవుట్ చేశాడంటే తనెంత వైవిధ్యమైన బంతులు వేశాడనేది అర్థమవుతుంది.

READ MORE: సన్ రైజర్స్ జెర్సీ మార్చింది.. రీజన్ ఇదేనా..?

ఇన్నాళ్ల నుంచి కులదీప్ కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. జట్టులోకి రావడం, వెళ్లడం చేస్తున్నాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేసుకోవడం, తర్వాత ఫామ్ కోల్పోవడం జరిగింది. తర్వాత బరువు పెరిగాడు. అన్నీ సెట్ అయ్యి తను జట్టులోకి వచ్చేసరికి ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ వచ్చేశాడు. అప్పటికే రవీంద్ర జడేజా ఉన్నాడు.  మరోవైపు అశ్విన్ ఉన్నాడు. దీంతో తనకి జట్టులో చోటు ప్రశ్నార్థకమై పోయింది.

2019 నుంచి 2024 వరకు తను రెండు టెస్టులు మాత్రమే ఆడాడంటే కెరీర్ ఎంత విషమంగా నడిచిందో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు ఇంగ్లాండ్ సిరీస్ లో తొలి టెస్ట్ ఆడని కులదీప్ ఇప్పటి వరకు 17 వికెట్లు తీశాడు. 51 వికెట్లతో ముందడుగు వేస్తున్నాడు.  మున్ముందు బజ్ బాల్ క్రికెట్ కి చెక్ పెట్టేందుకు, టీ 20 తరహాలో ఆడే బ్యాటర్లను అవుట్ చేయడంలో కులదీప్ దగ్గర ఎన్నో విలువైన అస్త్రాలున్నాయని ఈ మ్యాచ్ ద్వారా ప్రపంచానికి తెలిసింది.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×