Prabhas ‘Kalki 2898 AD’ Movie Twitter Review: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమా కు సంబంధించి ఉదయం 5 గంటలకే షోలు ప్రారంభ కానుండగా.. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన కొంతమంది అభిమానులు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారత పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించారు. మరి ఈ సినిమాపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారో చూసేద్దాం.
కల్కి సినిమాను దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో నాలుగేళ్లు రూపిందించారు. ఇవాళ థియేటర్స్‌లో కి వచ్చేసింది. ఈ మూవీ ఇప్పటికే యూఎస్ తో పాటు చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. అభిమానులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.
కల్కి సినిమాను నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రభాస్ ఫన్ క్యారెక్టర్ లో బాగా నటించాడు. ఇక అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటానీలు తమ కెరీర్‌లో కొత్త అనుభూతిని పొందే పాత్రలో నటించారు. విజివల్స్, సెటప్ ఓ రేంజ్‌లో ఉందని ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. డైరెక్టర్ ప్రతీ చిన్న విషయంపై దృష్టి సారించాడు, అతిథి పాత్రలో మృణాల్ ఠాకూర్ కాసేపు మాత్రమే ఉంటుంది. విజయ్ దేవరకొండ అతితి పాత్ర బేసిగ్గా ఉంది.
ఫస్టాఫ్‌లో ప్రభాస్ పాత్ర తక్కువగా అనిపించినా ఫన్ గా ఉండడంతో ఫ్యాన్స్ కు నచ్చుతుంది. ఇక, ఓవరాల్‌గా ఫస్టాఫ్‌లో అన్ని క్యారెక్టర్స్ ను సెట్స్ చేశారని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో డైరెక్టర్ ఆకర్షణీయంగా తెరకెక్కించారు. అయితే స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా ఉందని, కొన్ని చోట్ల బీజీఎం అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. మరికొంతమంది ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని.. ఇంటర్వెల్ తర్వాత కూడా పీక్స్ కి వెళ్లిందని అంటున్నారు. సెకండాఫ్ అయితే ఇంకా బాగుందని రివ్యూ ఇస్తున్నారు. హాలీవుడ్ లెవల్ లో మూవీ ఉందని, ఇంటర్వెల్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ట్వీట్ చేస్తున్నారు.
కల్కి సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ ఓ లెవల్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రభాస్ మాస్ షో అదిరింది అని, క్లైమాక్స్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా తెరపై ఇప్పటివరకు ఇలాంటి సీన్స్ ఎవరూ చూసి ఉండరు. ఈ సినిమాలో చాలా స్పెషల్ రోల్స్ లో ప్రధాన స్టార్స్ నటించారు. ప్రభాస్ క్యారెక్టర్ ను చాలా రోజుల తర్వాత ఫన్నీగా చూశామని కామెంట్స్ చేస్తున్నారు. బహుబలి రికార్డులను కల్కి బ్రేక్ చేస్తుందని ట్వీట్స్ చేస్తున్నారు.
#Kalki2898AD Passable 1st Half!
The visuals and set up is something that has not been seen from Indian cinema which is captivating along with an interesting storyline. However, the screenplay is done in a mostly flat way so far. Prabhas has a fun character but limited screen…
— Venky Reviews (@venkyreviews) June 26, 2024