Kalki2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అంటే.. అభిమానులు నిద్ర కూడా పోకుండా ఎదురుచూస్తూ ఉంటారన్న విషయం తెల్సిందే. ఇక చెప్పిన టైమ్ కు కనుక అప్డేట్ రాలేదా.. వాళ్లు చేసే రచ్చ అంతా ఇంతాకాదు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక మొట్టమొదటిసారి ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే జతకట్టనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులను క్రియేట్ చేసింది.
భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు ప్రభాస్ ను, అమితాబ్ క్యారెక్టర్స్ ను పరిచయం చేసిన మేకర్స్ నేడు దీపికా క్యారెక్టర్ ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. డార్లింగ్ నిన్న.. మన జీవితంలోకి స్పెషల్ వ్యక్తి వస్తుంది అని పోస్ట్ చేయడంతో మొదలైన హైప్.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు 5 గంటలకు బుజ్జి లుక్ రివీల్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు 5 దాటి చాలాసేపు అవుతుంది. ఇంకా అప్డేట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో అభిమానులు మండిపడుతున్నారు.
అరేయ్.. బుజ్జి వస్తుంది అన్నారు.. ఇంకా ఎంతసేపురా..? అని కొందరు.. బుజ్జి ట్రాఫిక్ లో బిజీ అని ఇంకొందరు.. అసలు ఏమైందిరా .. ? ఎవరైనా చెప్పండి రా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. హా ఇక వీళ్ళు ఏ అర్దరాత్రికో ఇస్తారు అని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి మేకర్స్ ఎప్పుడు బుజ్జిని పరిచయం చేస్తారో చూడాలి.