BigTV English

Virat Kohli: ఆ రెండు ఘటనలు మరిచిపోలేను: విరాట్ కోహ్లీ

Virat Kohli: ఆ రెండు ఘటనలు మరిచిపోలేను: విరాట్ కోహ్లీ

Unforgettable Incidents For Virat Kohli: ఆ రెండు ఘటనలు ఏమిటాని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే అంతొద్దు అని కోహ్లీ అంటున్నాడు. ఎందుకంటే అవేమీ ప్రేమ కథలు కాదు. కెరీర్ లో తనకి ఎదురైన రెండు మరిచిపోలేని ఘటనలని ఉదహరిస్తున్నాడు.. జానికి అవి సాధించి ఉంటే, తన క్రికెట్ జీవితం పరిపూర్ణమయ్యేదని అంటున్నాడు. ఇంతకీ ఏమిటా? రెండు ఘటనలని మీకూ అనిపిస్తోంది కదా.. ఇంతకీ అవేంటంటే


2016లో భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఓటమి తనని ఎంతగానో బాధించిందని అన్నాడు.

మరొకటి ఏమిటంటే, అదే ఏడాది ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు ఓడిపోయింది.


నిజానికి ఆ రెండు సిరీస్ ల్లో విరాట్ అద్భుతంగా ఆడాడు. 2016లో టీ 20 ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు.అలాగే ఐపీఎల్ లో కూడా 973 పరుగులు చేసి నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు.

ఈ రెండు ఇన్సిడెంట్ల తర్వాత చాలారోజులు కోలుకోలేక పోయానని అన్నాడు. చాలా నిరాసక్తగా అనిపించేది. నిస్సత్తువగా అనిపించేది. దేనిపైనా ఆసక్తి ఉండేది కాదు. కెరీర్ లో గాడిన పడటానికి కొంత సమయం పట్టేది. దీంతో కెరీర్ దెబ్బతినేలా ఉందని భావించి గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నానని తెలిపాడు.

మనం బాగా ఆడితే, ఇది కాకపోతే మరొక కప్పు కొట్టవచ్చునని భావించి ముందడుగు వేశానని తెలిపాడు. మొత్తానికి ఇలాంటి గట్టి దెబ్బలు తిని, తిని అలవాటైపోయిందని అన్నాడు. నిజంగా గెలిస్తే ఎగిరి గంతులేయడం, లేదంటే షరా మామూలే అనుకుంటూ తలదించుకుని వెళ్లిపోవడం అలవాటైపోయిందని అన్నాడు.

Also Read: ఆర్సీబీకి సవాల్.. 18 పరుగులు లేదా 18.1 ఓవర్ లో.. అలా అయితేనే ప్లే ఆఫ్!

అప్పుడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 సీజన్ లో చివరి మ్యాచ్ ఆడుతున్నాడు. గెలిస్తే మరికొన్ని నాకౌట్ మ్యాచ్ లు ఆడతాడు. ప్రస్తుతం ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడి 661 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇప్పటికి నెంబర్ వన్ బ్యాటర్ గా తనే నెంబర్ వన్ గా ఉన్నాడు.

అతని తర్వాత రుతురాజ్ 583 పరుగులతో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ (533), రియాన్ పరాగ్ (531) ఉన్నారు. వీరందరూ ప్లే ఆఫ్ లో ఆడనున్నారు. ఇప్పుడు ఆర్సీబీ వెళితే కోహ్లీ కూడా ఆడతాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. రిటైర్మెంట్ కి తొందరపడుతున్న కోహ్లీకి ఈ సిరీస్ కీలకమే అని చెప్పాలి.

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×