E-Paper
Advertisement

Kalyan Ram: ఈ దెబ్బతో కళ్యాణ్ రామ్ దశ తిరిగినట్టేనా..?

Kalyan Ram: ఈ దెబ్బతో కళ్యాణ్ రామ్ దశ తిరిగినట్టేనా..?
Advertisement

Kalyan Ram.. నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఒకప్పుడు నిర్మాతగా ఎలాంటి సాహసాలు చేసేవారో అందరికీ గుర్తుంది. ఆయన కెరియర్ ప్రమాదంలో పడ్డ సమయంలో అతను ఒక్కడే సినిమా చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి, ఈయన కెరియర్ ను మలుపు తిప్పింది. అంతే కాదు నిర్మాతగా మంచి లాభాలు కూడా అందుకున్నారు. అయితే ఆ తర్వాత ఈయనకు ఎక్కువగా ఎదురు దెబ్బలే తగిలాయని చెప్పాలి. ముఖ్యంగా కత్తి, జయీ భవ, హరే రామ్ , ఇజం , ఓం త్రిడి ఇలా ఎన్నో చిత్రాలు సొంత బ్యానర్ లోనే హీరోగా నటించినా.. అన్ని చిత్రాలతో కూడా దెబ్బతిన్నాడు కళ్యాణ్ రామ్.

అప్పుల బాధ నుంచి కళ్యాణ్ రామ్ ను బయటపడేసిన ఎన్టీఆర్..

Advertisement

ముఖ్యంగా ఇందులో ఈ సినిమాలన్నీ కొట్టిన దెబ్బ ఒక ఎత్తైతే.. ఓం త్రీ డీ సినిమా కొట్టిన దెబ్బ ఇంకో ఎత్తు అని చెప్పవచ్చు. ఇవి చాలవు అన్నట్లు రవితేజతో చేసిన బయట చిత్రం కిక్ -2 కూడా భారీగా తేడా కొట్టడంతో కళ్యాణ్ రామ్ తేరుకోలేకపోయారు. ముఖ్యంగా ఈ నిర్మాణం మనకెందుకు అనే స్థాయికి దిగజారి పోయారు కళ్యాణ్ రామ్. ఇలాంటి టైంలో ఆయన తమ్ముడు స్టార్ హీరో ఎన్టీఆర్ అండగా నిలిచారు. నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు అత్యధిక లాభాలు అందించిన చిత్రం ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ. ఈ సినిమా కంటెంట్ పరంగానే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సంచలనం సృష్టించింది. నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు మంచి లాభాలు అందించి, అప్పటి వరకు ఉన్న కళ్యాణ్ రామ్ అప్పులన్నింటినీ కూడా ఈ సినిమా తీర్చేసింది. ఇక తర్వాత ఆయనే హీరోగా బింబిసారా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఎంత విజయం సాధించింది అంటే ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి రెట్టింపు స్థాయిలో వెనక్కి రావడం ఆయన ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

కళ్యాణ్ రామ్ కళ్యాణం మూవీ లో విజయశాంతి కీలక రోల్..

Advertisement

ఇలా వరుస చిత్రాలు చేస్తూ సక్సెస్ బాట పట్టిన కళ్యాణ్ రామ్ కి దేవర మరో విజయాన్ని అందించింది. అంతకుమించి బిజినెస్ జరిగింది. మంచి లాభాలకు సినిమాను అమ్ముకున్నారు. అటు సినిమా నిర్మాతగా ఈయన హ్యాపీ . ఈయన సినిమా కొన్న బయ్యర్లు కూడా హ్యాపీ. అలా మొత్తానికి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు కళ్యాణ్ రామ్ హీరోగా కళ్యాణం అనే సినిమా చేస్తున్నారు. ఇందులో సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ భారీ విజయాన్ని అందుకున్న విజయశాంతి.. చాలా సంవత్సరాల తరువాత మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె సినిమాలో కనిపించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కళ్యాణం సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.మొత్తానికి అయితే ఈ సినిమా హిట్ అయితే ఇక కళ్యాణ్ రామ్ దశ తిరిగినట్టే అని చెప్పడంలో సందేహం లేదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×