E-Paper
Advertisement

మల్కాజిగిరిలో చెత్త సమస్యలకు చెక్.. ఎంఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయాలు!

మల్కాజిగిరిలో చెత్త సమస్యలకు చెక్.. ఎంఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయాలు!
Advertisement

Ramky Sanitation: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెత్త సేకరణ, తరలింపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న రాంకీ సంస్థ పనితీరుపై మంగళవారం మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేకంగా సమీక్షించారు. మల్కాజ్ గిరి కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడం, చెత్త సేకరణ, తరలింపులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడం, రాంకీ సంస్థ పనితీరును సమర్థవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఎంఎంసీ కమిషనర్ ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెల 30వ తేదీన నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలు, నివేదికల్లో గుర్తించిన లోపాలపై కమిషనర్ రాంకీ వైస్ ప్రెసిడెంట్, సంస్థ సిబ్బందితో సమీక్షించి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, జాయింట్ కమిషనర్ శ్రావణి, ఏఈలు మౌనిక, నిఖిల, రాంకీ వైస్ ప్రెసిడెంట్ సోనియా, సుధాకర్, శ్రీనివాస్‌తో పాటు రాంకీ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం, పారిశుద్ధ్య నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావడం లక్ష్యంగా అమెరికాకు చెందిన సోనియాను రాంకీ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు రాంకీ ప్రతినిధులు సమావేశంలో వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

వాహనాల కొరత కు చెక్

Advertisement

ఎంఎంసీ పరిధిలోని కొన్ని సర్కిళ్లలో పారిశుద్ధ్య పనులకు అవసరమైన వాహనాల కొరత ఉన్నట్లు సమావేశంలో చర్చించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను కొత్త వాహానాలను కొనుగోలు చేసిన వాహనాల కొరతకు చెక్ పెట్టాలని కమిషనర్ ఆదేశించారు. 10 టిప్పర్లు, 2 బాబ్‌క్యాట్‌లను వారంలోగా కొనుగోలు చేయాలని కమిషనర్ ఆదేశాల మేరకు రాంకీ సంస్థ నిర్ణయించింది. అదనంగా మూడు జోన్లకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 రిజర్వ్ వాహనాలను కూడా కొనుగోలు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విధుల్లో ఉన్న వాహనం ఏదైనా మరమ్మతులకు గురై నిలిచిపోయినప్పుడు, సంబంధిత జోన్‌కు కేటాయించిన రిజర్వ్ వాహనాన్ని వెంటనే వినియోగించి పారిశుద్ధ్య పనులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

వార్డు, సర్కిల్, జోన్ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ

Advertisement

పారిశుద్ధ్య పనులు సకాలంలో పూర్తి చేసేందుకు, నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఎంఎంసీ పరిధిలోని ప్రతి వార్డుకు కమిషనర్ ఆదేశాల మేరకు ఒక వార్డు ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించినట్లు రాంకీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదేవిధంగా 14 సర్కిళ్లకు 14 మంది సర్కిల్ ఇన్‌చార్జిలను, మూడు జోన్లకు జోనల్ ఇన్‌చార్జిలను నియమించినట్లు వెల్లడించారు. ఈ నియామకాల ద్వారా వార్డు స్థాయి నుంచి జోన్ స్థాయి వరకు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణను మరింత పటిష్టం చేయనున్నట్లు రాంకీ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ నివేదికలపై ప్రత్యేక అబ్జర్వేషన్

ఎంఎంసీ అవసరాలకు అనుగుణంగా ఆన్‌లైన్ రిపోర్టింగ్ విధానంలో కమిషనర్ ఆదేశాల మేరకు అవసరమైన మార్పులు చేసినట్లు రాంకీ సంస్థ తెలిపింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ నివేదికలను పరస్పరం పరిశీలించి ధ్రువీకరించేందుకు ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించినట్లు వెల్లడించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ నివేదికలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పరిశీలించి, వాటికి సంబంధించిన సమగ్ర నివేదికలను కమిషనర్, అదనపు కమిషనర్ కార్యాలయాలకు అందజేస్తామని రాంకీ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఆన్‌లైన్ నివేదికలను నేరుగా పరిశీలించేందుకు వీలుగా ప్రతి అధికారికి ప్రత్యేక లాగిన్ ఖాతాలను సృష్టించినట్లు వెల్లడించారు. ఈ లాగిన్ వివరాలను సంబంధిత అధికారులకు అందజేసి, పారిశుద్ధ్య పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

పారిశుద్ధ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ

ఈ విధానం అమలుతో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, వార్డు స్థాయి పారిశుద్ధ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు వారు కమిషనర్ కు వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో వాహనాలు, సిబ్బంది అందుబాటులో ఉండటంతో పాటు, క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ, నివేదికల ధ్రువీకరణ, సమస్యల తక్షణ పరిష్కారం కీలకమని కమిషనర్ సూచించారు. రాంకీ సంస్థ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఎంఎంసీ పరిధిలో పరిశుభ్రత ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడం, చెత్త పేరుకుపోయే ప్రాంతాలను నివారించడం, ప్రతి వార్డులో నిరంతర పర్యవేక్షణతో పరిశుభ్రమైన మల్కాజిగిరి నిర్మించడమే లక్ష్యంగా పని చేయాలని కూడా రాంకీకి సూచించారు.

Also Read: తిరుపతి కార్పొరేషన్‌లో బీజేపీకి షాక్.. ఓడిపోయిన జిల్లా, నగర అధ్యక్షులు!

Tags

Related News

హైదరాబాద్ ED బిగ్ ఆపరేషన్.. అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు!

ఎంపీలో తెలంగాణ యువతి ఆత్మహత్య.. బీటెక్ థర్డ్ ఇయర్, వెలుగులోకి షాకింగ్ విషయాలు,

చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ మృతి.. నిందితురాలిపై హత్య కేసు నమోదు!

కేటీఆర్ నోటిని ఫినాయిల్‌తో కడగాలి.. అధికారం పోగానే గజ్జె గుర్తుకొచ్చిందా?– మెట్టు సాయికుమార్

గండిపేట కాండ్యూట్‌కు స్పీడ్ రిపేర్లు.. నీటి సరఫరాపై జలమండలి కీలక ఆదేశాలు!

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కవిత కీలక వ్యాఖ్యలు.. మరోసారి గుట్టు బయటకు

హైదరాబాద్‌లో హైడ్రా మెరుపు దాడులు.. రెండు పార్కులు స్వాధీనం.. తెల్లాపూర్‌లో అక్రమ బోర్ల తొలగింపు!

Big Stories

Advertisement
×