E-Paper
Advertisement

Kalyan Ram : 500 మంది ఫైటర్స్‌తో క‌ళ్యాణ్ రామ్ ఫైట్

Kalyan Ram : 500 మంది ఫైటర్స్‌తో క‌ళ్యాణ్ రామ్ ఫైట్
Advertisement
Kalyan Ram

Kalyan Ram : డిఫరెంట్ మూవీస్, రోల్స్ చేస్తూ హీరోగా తనదైన‌ వెర్సటాలిటీతో మెప్పిస్తోన్న స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. 500 మందితో ఈ ఫైట్‌ను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్‌గా చెప్పుకునేలా దీన్ని ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ ఆధ్వ‌ర్యంలో డిజైన్ చేశారు.

‘‘ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా డెవిల్ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాం. కొత్త సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే త‌ప‌న ఉన్న మా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ మ‌రో డిఫ‌రెంట్ అవతార్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సినిమా అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. 500 మంది ఫైట‌ర్స్‌తో ఈ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను వెంక‌ట్‌గారు నేతృత్వంలో చిత్రీక‌రిస్తున్నారు. దీన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూస్తే వావ్ అనేంత గొప్ప‌గా పిక్చ‌రైజేష‌న్ ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు నిర్మాత అభిషేక్ నామా.

Advertisement

నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ మూవీ పీరియాడిక్ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార మూవీ కూడా పీరియాడిక్ టచ్‌తోనే సాగింది. ఆ తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా మరోసారి డెవిల్ వంటి పీరియాడిక్ చిత్రంతో కళ్యాణ్ రామ్ సందడి చేయబోతున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సౌంద‌ర్ రాజన్‌.ఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతాన్ని … శ్రీకాంత్ విస్సా కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×