BigTV English

Shriya Saran : ఐఏఎస్ ఆఫీసర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రియా శ‌రన్‌

Shriya Saran : ఐఏఎస్ ఆఫీసర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రియా శ‌రన్‌
Shriya Saran

Shriya Saran : తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని ద‌క్కించుకున్న హీరోయిన్ శ్రియా శ‌ర‌న్‌. పెళ్లి కాక ముందు ఎంత గ్లామ‌ర్‌గా ఉండిందో.. అదే గ్లామ‌ర్‌ను త‌ల్లైన త‌ర్వాత కూడా మెయిన్ టెయిన్ చేయ‌టం ఆమెకే చెల్లింది. దీంతో ఇప్ప‌టికీ శ్రియా శ‌ర‌న్‌కు సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆర్ఆర్ఆర్‌లో కీల‌క పాత్ర‌లో న‌టించిన శ్రియా శ‌ర‌న్ ఇప్పుడు మ‌రో సినిమాలో న‌టిస్తుంది. ఆ సినిమా ఏదో కాదు.. ‘మ్యూజిక్ స్కూల్‌’. ఎడ్యుకేష‌న్ సిస్ట‌మ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ రూపొందింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొన‌సాగుతున్న ఎడ్యుకేష‌న్ సిస్ట‌మ్ కార‌ణంగా విద్యార్థుల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి నెల‌కొంటుంది.


చదువు చెప్పే పద్ధతి రొటీన్‌గా ఉండ‌కుండా మ్యూజిక్‌తో పాఠాల‌ను చెబితే ఎలా ఉంటుంద‌నే క‌థాంశంతో ‘మ్యూజిక్ స్కూల్’ రూపొందింది. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఈ సినిమాలో 11 పాట‌లుండ‌టం విశేషం. పాపారావు బియ్యాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమంటే ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ఓ క‌లెక్ట‌ర్‌.. పాపారావు బియ్యాల‌. సినిమాపై ఉన్న ఆసక్తితో పాపారావు ఐఏఎస్ జాబ్‌ను వ‌దిలేసి మ‌రీ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మే 12న విడుద‌ల‌వుతుంది.

యామినీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై తెలుగు, హిందీ భాష‌ల్లో మ్యూజిక్ స్కూల్ సినిమాను తెర‌కెక్కించారు. త‌మిళంలో దీన్ని అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మిగ‌తా చోట్ల పి.వి.ఆర్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది. ఓజూ బారువా, గ్రేసీ గోస్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇంకా బెంజిమిన్ జిలాని, సుహాసిని మౌలే, మోన‌, లీలా సామ్‌స‌న్స్‌, బ‌గ్స్ భార్గ‌వ‌, విన‌య్ వ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వ‌కార్ షేక్‌, ఫ‌ణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×