BigTV English

Mad Square Story : మ్యాడ్ స్క్వేర్ స్టోరీ మొత్తం లీక్… గోవాలో వాళ్లకు ఏం జరిగిందంటే..?

Mad Square Story : మ్యాడ్ స్క్వేర్ స్టోరీ మొత్తం లీక్… గోవాలో వాళ్లకు ఏం జరిగిందంటే..?

Mad Square Story : ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఎక్కువ బజ్ సినిమా ఈ మ్యాడ్ స్క్వేర్. పెద్దగా స్టార్ కాస్ట్ లేకున్నా.. మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై బజ్ భారీగా పెరిగింది. పైగా సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా బానే వర్క్ అవుట్ అయ్యాయి. దీంతో ఈ వారం చాలా మందికి మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ ఆప్షన్‌గా ఉంది. అయితే, ప్రస్తుతం ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ ఇండస్ట్రీలో చక్కర్లుకొడుతుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం…


కామెడీ జానర్ మూవీస్ ఫెయిల్ అయినట్టు ఇండస్ట్రీలో చరిత్రలో లేదు. అందుకే యంగ్ డైరెక్టర్లు, యంగ్ హీరోలు ఆ జానర్‌ను ఎంచుకుంటారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కూడా అదే జానర్ ఎంచుకుని సినిమాలు చేస్తున్నాడు. సంగీత్ శోభన్, నార్నే నితిన్ లాంటి హీరోలకు మంచి అవకాశంలా మారింది.

ఈ కాంబోలో 2023లో మ్యాడ్ మూవీ వచ్చింది. అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కేవలం 8 కోట్ల బడ్జెట్‌తో చేసిన ఈ మూవీ దాదాపు 26 కోట్లు కలెక్ట్ చేసిందంటే.. ఎంత పెద్ద హిట్ అయిందో అర్థమైపోతుంది. అది కూడా పెద్ద స్టార్ కాస్ట్ ఏం లేకుండానే. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ వస్తుంది. సేమ్ అదే కాంబో కాబట్టి… రెట్టింపు బజ్ ఉంది. ఈ మూవీ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.


మ్యాడ్ స్క్వేర్ స్టోరీ ఇదే.. ?

అయితే ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ కథ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం…

మ్యాడ్ స్క్వేర్ మూవీ స్టార్టింగ్‌లో లడ్డు పాత్రకు పెళ్లి అవుతుంది. అయితే ఆ పెళ్లిని డీడీ, అశోక్, మనోజ్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తారు. అలా పెళ్లిని క్యాన్సిల్ చేసి అందరూ గోవాకు వెళ్తారు. అక్కడ ఏంజాయ్ చేస్తున్న టైంలో వీళ్లు నలుగురు ఒక డైమాండ్ దొంగతనం కేసులో ఇరుక్కుంటారు.

దీంతో వాళ్ల ట్రిప్ మొత్తం ఆయోమయంలో పడిపోతుంది. ఆ చోరీ కేసు నుంచి వాళ్లు ఎలా బయటికి వచ్చారు. మళ్లీ వాళ్ల ఇంటికి సేఫ్‌గా వచ్చారా..? అనేది మిగితా స్టోరీగా చూపించబోతున్నారట.

నిజానికి చెప్పాలంటే… స్టోరీలో కొత్తదనం ఏం లేదు. ఈ పాయింట్‌పైన చాలా సినిమాలు వచ్చాయి. అయినా… ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీపై బజ్ పెరుగుతుందంటే కారణం… కళ్యాణ్ శంకర్ స్క్రీన్ ప్లే పై ఉన్న నమ్మకం అని చెప్పొచ్చు. అలాగే.. మ్యాడ్ మూవీ అని కూడా చెప్పొచ్చు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×