BigTV English

Raviteja : రవితేజ చాలా పెద్ద తప్పు చేశాడు… మళ్లీ అలాంటి ఛాన్స్ వస్తుందా?

Raviteja : రవితేజ చాలా పెద్ద తప్పు చేశాడు… మళ్లీ అలాంటి ఛాన్స్ వస్తుందా?

Raviteja : మాస్ మహారాజ రవితేజ (Raviteja) చేసిన ఒక కాస్ట్లీ మిస్టేక్ ఇప్పుడు ఆయన అభిమానులను తెగ బాధ పెడుతోంది. రీసెట్ గా రవితేజ వదులుకున్న ఓ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ కావడంతో ఈ సినిమాను రవన్న వదులుకోకపోయి ఉంటే బాగుండేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రవితేజ ఫ్యాన్స్ ను ఇంతగా బాధ పెడుతున్న ఆ మూవీ ఏంటి ? రవితేజ ఆ ప్రాజెక్ట్ ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళితే…


టెస్ట్ లుక్ పూర్తయ్యాక అటకెక్కిన ప్రాజెక్ట్

రవితేజ కెరీర్ లో అల్టిమేట్ హిట్ గా నిలిచిన మూవీ ‘ధమాకా’ (Dhamaka). ఆ తర్వాత ఇంతవరకు ఆయన చేసిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. రవితేజతో సినిమా చేసిన ఒక్క ప్రొడ్యూసర్ కూడా లాభాలను కళ్ల చూడలేదని చెప్పాలి. కానీ రవితేజ సినిమా అంటే భారీ హైప్ తో పాటు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది మరి. కానీ రిలీజ్ అయిన తర్వాతే ఆ లెక్కలు కంప్లీట్ గా మారిపోతున్నాయి.


ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజా రవితేజ, భారీ యాక్షన్ సినిమాల దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబోలో ఓ మూవీ రాబోతుందనే కిరాక్ వార్త రవితేజ అభిమానులను ఎగిరి గంతేసేలా చేసింది. RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రాబోతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంది. అయితే సడన్ గా ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. టెస్ట్ లుక్ కూడా పూర్తయ్యాక సినిమా ఆగిపోయిందనే బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది.

దానికి కారణం సినిమాకు భారీ బడ్జెట్ పెట్టాల్సి రావడం, అలాగే హీరో తీసుకునే భారీ రెమ్యూనరేషన్ అని టాక్ నడిచింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ 120 కోట్లకు పైగా అవ్వడంతో రవితేజతో రిస్క్ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేసారని సమాచారం. అంతేకాకుండా రవితేజ ఈ ప్రాజెక్టుకి ఏకంగా 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతుండడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారని అన్నారు. చివరకు ఈ ప్రాజెక్టుని రవితేజ చేజార్చుకున్నాడు.

మళ్లీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడొస్తుందో ?!

ఆ తర్వాత గోపీచంద్ మలినేని ఇదే ప్రాజెక్ట్ ని బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో పాన్ ఇండియా మూవీగా పట్టాలెక్కించాడు. ఈ మూవీకి ‘జాట్’ (Jaat) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా, దాన్ని చూసిన రవితేజ అభిమానులు మాస్ మహారాజా ఈ మూవీని మిస్ చేసుకోకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు. కారణం ఏదైనా రవితేజ గనుక ఈ ప్రాజెక్ట్ ను మిస్ చేసుకోకుండా ఉంటే, ఆయనకు సాలిడ్ పాన్ ఇండియా కం బ్యాక్ దొరకడంతో పాటు,  రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేదని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×