Kalyani Priyadarshan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంతోమంది అడుగు పెడతారు. అయితే అలా వచ్చిన వారు కొంతమంది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటే.. మరికొంతమంది కొన్ని చిత్రాలతోనే దూరమైపోతూ ఉంటారు.అలా ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సినిమాలతో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan). పేరుకే మలయాళీ అయినా తెలుగులో ఆకట్టుకుంది. అయితే నటిగా మంచి మార్కులు అందుకుంది. కానీ సరైన సక్సెస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా నటించిన ‘హలో’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మిగలడంతో అటు కళ్యాణి ప్రియదర్శన్ కి కూడా గుర్తింపు రాలేదు. కానీ ఆమె నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత తేజ్ ‘చిత్రలహరి’, శర్వానంద్ (Sharwanand) ‘రణరంగం’ చిత్రాలలో నటించింది. ఇక్కడ ఎన్ని సినిమాలు చేసినా అసలైన గుర్తింపు రాకపోవడంతో తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో మాత్రం అవకాశాలు తలుపు తడుతున్నాయి.
మోహన్ లాల్ కొడుకుతో ప్రేమలో పడ్డ కళ్యాణి ప్రియదర్శన్..
అలా ముఖ్యంగా మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అయితే ఇలాంటి సమయంలో ఈమె ఒక యంగ్ హీరోతో ప్రేమలో పడింది అంటూ వార్తలు సినీ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ వార్తలు నిజం కావాలని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కళ్యాణి ప్రియదర్శన్ ప్రేమలో పడిన ఆ హీరో ఎవరో కాదు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) కొడుకు ప్రణవ్ మోహన్ లాల్(Pranav Mohan Lal).
అదే నిజమైతే మాకు అభ్యంతరం లేదు – కళ్యాణి తల్లి..
ప్రణవ్ మోహన్ లాల్ తో ఈమె ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, అయితే రహస్యంగానే తమ ప్రేమను ఉంచారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. ఇక వార్తలు జోరుగా సాగుతున్న వేళ దర్శకుడు అలెప్పీ అష్రఫ్ ఈ రూమర్లపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “నాకు రెండు కుటుంబాలతో మంచి పరిచయం ఉంది. వీరి ప్రేమ వార్తలపై లిజీ (కళ్యాణి ప్రియదర్శన్ తల్లి)ని అడిగితే..” అదే నిజమైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని” ఆమె చెప్పింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తమ పిల్లల మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని ఆమె తేల్చి చెప్పింది “అంటూ డైరెక్టర్ తెలిపారు..
ప్రణవ్ జర్మనీకి చెందిన అమ్మాయితో ప్రేమలో ఉన్నారు – డైరెక్టర్
ఇకపోతే ఇదే విషయంపై దర్శకుడు మాట్లాడుతూ.. “ప్రణవ్ మోహన్ లాల్ ప్రేమలో ఉన్నాడు. కానీ కళ్యాణితో కాదు జర్మనీకి చెందిన ఒక అమ్మాయితో ఆయన ప్రేమలో ఉన్నాడు. రూమర్లు ఇప్పటికైనా ఆపండి” అంటూ దర్శకుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇకపోతే ప్రణవ్ , కళ్యాణి కలిసి 2022లో వచ్చిన ‘హృదయం’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి పలు సినిమాలకు పని చేశారు. ఇక అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించిందని, రహస్యంగా డేటింగ్ కూడా చేసుకుంటున్నారని వార్తలు గుప్పిస్తున్నారు. ఇక ఎట్టకేలకు డైరెక్టర్ స్పందిస్తూ వీరి ప్రేమ, డేటింగ్ రూమర్స్ కి చెక్ పెట్టారు.
Bollywood: బ్రాహ్మణులపై ఉ*చ్చ పోస్తా… స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!