E-Paper
Advertisement

Hero Clarity: కాంట్రవర్సీపై హీరో కమల్‌హాసన్‌ క్లారిటీ

Hero Clarity: కాంట్రవర్సీపై హీరో కమల్‌హాసన్‌ క్లారిటీ
Advertisement

Kamal Haasan new movie update(Cinema news in telugu): లోకనాయకుడు హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. సెన్సేషనల్‌ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని ఈనెల 12న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు మూవీ టీమ్. 1996లో వచ్చిన భారతీయుడుకి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో కమల్‌హాసన్ సేనాపతిగా సందడి చేయనున్నారు. జులై 6న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అయితే అంతకుముందు కమల్‌ ఇండియన్‌ 2 పై చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ఇండియన్ 3 తనకు చాలా నచ్చిందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంటే కమల్‌కి ఇండియన్‌ 2 నచ్చలేదా? అంత కాన్ఫిడెన్స్ లేదా అని సోషల్‌మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్దార్థ ఇదే మ్యాటర్‌ని కమల్ దృష్టికి తీసుకొచ్చాడు. మీ కామెంట్స్‌ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. కాస్త క్లారిటీ ఇవ్వండని అడగ్గా కమల్‌ క్లారిటీ ఇచ్చాడు. ఇండియన్ 3 మూవీ నచ్చిందని చెబితే ఇండియన్ 2 నచ్చలేదనుకుంటారా అంటూ కమల్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇండియన్ 2 మూవీలో కొందరికి ఫస్టాఫ్‌ నచ్చుతుందని, మరికొందరు సెకండాఫ్‌ అని ఎవరికి వారే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ కమల్ ఫైర్ అయ్యారు. ఇండియన్‌ 3లో సెకండాఫ్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుందని ఇది అందరికి తప్పకుండా నచ్చుతుందని చెప్పాడు. దీంతో ఈ కామెంట్స్ కాస్తా మిస్‌ఫైర్ అయ్యాయి.

Advertisement

Also Read: రాజ్‌తరుణ్‌ కేసులో బిగ్ ట్విస్ట్‌, మీడియా ముందుకు లావణ్య

కమల్‌హాసన్‌కి భారతీయుడు 2 నచ్చలేదని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ కన్‌ఫ్యూజన్‌కి తెర దించుతూ కమల్‌హాసన్ తాజాగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. శంకర్‌తో తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉందని, కానీ మీడియా కారణంగా ఆయన నాకు కాల్ చేసి ఏం జరిగిందని ఆరా తీయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నాడు. పిల్లల్ని అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా అంటే ఏం చెబుతారు. అలాంటి ప్రశ్నల్ని పిల్లల్ని అడగకూడదు. నాకు ఇండియన్ 2, ఇండియన్ 3 ఒకటే. ఏదీ ఎక్కువా కాదు. ఏదీ తక్కువా కాదు. ఓ సీన్ నచ్చిందని చెప్పినంత మాత్రాన మిగతా సీన్‌లు నచ్చలేదని ఊహించేసుకుంటే ఎలా అంటూ సోషల్‌ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ ఇండియన్ 3 మూవీ రిలీజ్ డేట్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నానని తెలిపాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×